ఆంధ్రప్రదేశ్ ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేటీకరించే నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కె అజయ్ కుమార్, నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ మంగళవారం నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడారు. 33 మంది అమరవీరుల త్యాగ ఫలితం విశాఖ ఉక్కు అని దీన్ని అమ్మే హక్కు కేంద్రానికి లేదని అన్నారు. నాడు పార్టీలకు అతీతంగా 70 మంది శాసనసభ్యులు తమ పదవులకు రాజీనామాలు చేసి కేంద్రం మెడలు వంచి విశాఖ ఉక్కు పరిశ్రమను సాధించారని దీన్ని అమ్మాలని చూస్తే ఆంధ్రులు సహించబోరని కేంద్రాన్ని హెచ్చరించారు. రాష్ట్రంలోని ఏకైక ప్రభుత్వరంగ సంస్థ విశాఖ ఉక్కు అని, నవరత్నాల్లో ఒకటైన విశాఖ ఉక్కుకు గనులు కేటాయించకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించాయని అయినా విశాఖ ఉక్కు కార్మికులు పట్టుదలతో పరిశ్రమకు ఆదాయాలు వచ్చేలా కష్టించి పనిచేస్తున్నారని అన్నారు. కరోనా కష్టకాలంలో భారతదేశంలోని అనేక రాష్ర్టాలకు విశాఖ ఉక్కు పరిశ్రమ ఆక్సిజన్ అందించిన విషయం కేంద్రంలోని పెద్దలు గ్రహించాలని హితవు పలికారు.
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు అన్నారు. లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే పరిశ్రమని కారు చౌకగా కార్పొరేట్లకు కట్టబెట్టే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని లేకుంటే పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మూలం రమేష్, నగర అధ్యక్షులు ఏ శ్రీనివాసులు, సిఐటియూ జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, కె పెంచలనర్సయ్య, నగర కమిటీ సభ్యులు పి సూర్యనారాయణ, మూలం ప్రసాద్, జీ సుధాకర్ రెడ్డి, సుధాకర్, ఆటో యూనియన్ నగర నాయకులు మురళి, నాగూర్, జగదీష్, లక్ష్మీనారాయణ, కొట్టుముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు రామయ్య, శ్రీనివాసులు, హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులు కాశయ్య, ఎన్ వెంకటేశ్వర్లు, ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు.
పి.ఎం.జి.కే.ఏ.వై కింద
ఏ మేరకు సబ్సిడీ బియ్యాన్ని కేటాయించారు?
పార్లమెంట్లో అడిగిన నెల్లూరు ఎంపీ ఆదాల
గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (పి.ఎం.జి.కె.ఏ.వై) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ ఏడాది జూలై -నవంబర్ నెలల్లో ఏ మేరకు సబ్సిడీ బియ్యాన్ని కేటాయించారని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి మంగళవారం లోక్ సభలో ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాలుగో విడత కింద కేటాయించిన మొత్తం కోటా ఎంత అని కూడా అడిగారు. దీనికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి, ప్రజాపంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాత పూర్వకంగా సమాధానం చెబుతూ 198.78 లక్షల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను ప్రభుత్వం కేటాయించిందని తెలిపారు. ఈ ఏడాది జులై -నవంబర్ నెలలకు ఈ కోటా కేటాయించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది జులై- నవంబర్ నెలలకు ఆంధ్రప్రదేశ్ కు
6,70,552.58
మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలను కేటాయించగా 2,466.909 కోట్ల రూపాయల సబ్సిడీ లభించినట్లు తెలిపారు. అలాగే మే- జూన్ నెలల్లో 268223.23 మెట్రిక్ టన్నులు కేటాయించామన్నారు. ఇందుకుగానూ కేంద్ర ప్రభుత్వం 986.77 కోట్ల రూపాయల సబ్సిడీని అం
కావలి మండలం ముసునూరు జగనన్న మెగా లేఅవుట్ ను జిల్లా కలెక్టర్ కేవిఎన్ చక్రధర్ బాబు తో కలసి పరిశీలిస్తున్న కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి , ఏఎంసి చైర్మన్ మన్నె మాకావలి మండలంలో ముసునూరు గ్రామంలో జగనన్న కాలనీలో ఇళ్ళ స్థలాలను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు ,ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి.ల సుకుమార్ రెడ్డి , పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.కావలిలో కచేరిమిట్ట గ్రామ సచివాలయంను పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ కె విఎన్ చక్రధర్ బాబు.. ఈ సందర్భంగా ఆయన సచివాలయ పనితీరును ఆరా తీశారు
కోవిడ్ నిబంధనలు పాటిస్తూ బారా షహీద్ దర్గాలోనే సాంప్రదాయ పద్ధతులను అనుసరించి ఉత్సవాలు జరుగుతాయని జిల్లా సంయుక్త కలెక్టర్ హరెందిర ప్రసాద్ పేర్కొన్నారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లోని చాంబర్లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ గత సంవత్సరం కూడా కోవిడ్ నేపథ్యంలో ఊరేగింపు లేకుండా బారాషహీద్ దర్గాలోనే ఉత్సవాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రస్తుతం జిల్లాలో కోవిడ్ మహమ్మారి ఇంకా నెలకొని ఉన్నందున జన సమూహం లేకుండా దర్గాలోనే దర్గా సాంప్రదాయ పద్ధతులను అనుసరించి 20 మంది మత పెద్దలతోనే ప్రార్థనలు, గంధం , ఉరుసు ఉత్సవాలు జరుగుతాయన్నారు. కరోనా పాజిటివ్ కేసులు ఉన్నందున ఎటువంటి ప్రదర్శనశాలలు ఏర్పాటు చేయకూడదని, టెండర్లు ఏమీ ఉండవని స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాలు, ప్రాంతాలనుండి ఎవరు కూడా పెద్ద ఎత్తున జిల్లాకు తరలి రాకుండా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. జిల్లాలో ఎడగారు కాలంలో లక్షా ఇరవై వేల ఎకరాల్లో వరి పంట సాగుచేశారని, దాదాపు 4 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందన్నారు.
ఒంగోలు పార్లమెంటు సభ్యులు, గౌ. శ్రీ మాగుంట శ్రీనివాసులురెడ్డిగారు మరియు ఆయన తనయులు – ప్రముఖ పారిశ్రామిక వేత్త, శ్రీ మాగుంట రాఘవరెడ్డి గారు ఈ రోజు డిల్లీలోని తన కార్యాలయంలో అన్ని పార్టీలకు చెందిన మంత్రులు మరియు పార్లమెంటు సభ్యులు 70 మందికి ఆత్మీయ విందు ఇచ్చినారు. ఈ విందు కార్యక్రమంలో విదేశీ వ్యవహారాల శాఖ సహాయక మంత్రి, శ్రీమతి మీనాక్షి లేఖీ గారు, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ సహాయక మంత్రి, శ్రీమతి అనుప్రియా పటేల్ గారు, పార్లమెంటు సభ్యులు మరియు మాజీ న్యాయ శాఖ సహాయక మంత్రి, శ్రీ పి.పి.చౌదరి గారు, పార్లమెంటు సభ్యులు మరియు ఎస్టిమేట్స్ కమిటీ చైర్మన్, శ్రీ గిరీష్ బాలచంద్ర బాపట్ గారు, పార్లమెంటు సభ్యులు మరియు మాజీ గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి, శ్రీ ఫ్రాన్సిస్కో సర్ దిన్ హా గారు, పార్టీల ఫ్లోర్ లీడర్లు, శ్రీ పినాకి మిశ్రా గారు (BJD), శ్రీ నామా నాగేశ్వర రావు గారు (TRS), శ్రీ నితేష్ పాండే గారు (BSP), పార్లమెంటు సభ్యులు, శ్రీ కార్తీ చిదంబరం గారు, శ్రీమతి కనిముళి కరుణానిధి గారు, మాజీ కేంద్ర మంత్రి, శ్రీ ప్రఫుల్ పటేల్ గారు, శ్రీ పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ గారు, శ్రీ నిషికాంత్ దూబే గారు, శ్రీమతి ప్రియాంకా చతుర్వేది గారు (రాజ్య సభ సభ్యులు), మాజీ ప్రధాన మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారి కుమారులు, శ్రీ నీరజ్ శేఖర్ గారు, శ్రీ విజయసాయిరెడ్డి గారు, శ్రీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి గారు, శ్రీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి గారు, శ్రీ లావు కృష్ణదేవరాయలు గారు, శ్రీ గళ్ళా జయదేవ్ గారు, శ్రీ కింజరపు రామ్మోహన్ నాయుడు గారు, శ్రీ కేశినేని నాని గారు, శ్రీ రేవంత్ రెడ్డి గారు, శ్రీమతి సుప్రియా సూలే గారు, శ్రీమతి సుమలత అంబరీష్ గారు, శ్రీమతి గొద్దేటి మాధవి గారు, శ్రీ దానే సలీ గారు, శ్రీ P.C. మోహన్ గారు, శ్రీ శివకుమార్ ఉదాశీ గారు శ్రీ సౌగత రాయ్ గారు (AITC), శ్రీ హిబి ఇడెన్ గారు (INC), శ్రీ మనిక్కం ఠాగూర్ గారు, డా. కళానిధి వీరస్వామి గారు మరియు తదితర పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు.