...........................................
ఎప్పుడూ అధికారిక సమావేశాలు, సమీక్షలతో క్షణం తీరికలేకుండా ఉండే రాష్ట్ర నీటి పారుదల శాఖామంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు పార్టీ నేతలు, అభిమానులు, ప్రముఖులతో ఆత్మీయ సమావేశం జరిపి అందరి సమస్యలు విని వాటిని పరిష్కరిస్తానని హామీఇస్తే పార్టీ కార్యకర్తలు ఎంత సంతోషిస్తారో మాటల్లో వర్ణించలేం. అలాంటి కార్యక్రమాన్ని 14వ డివిజన్ లో నిర్వహించి దానికి అధ్యక్షత వహించారు డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి. 23వ తేదీ సాయంత్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారితో బాలాజీ నగర్ లోని త్యాగరాజ స్వామి కళ్యాణ మండపంలో ఆత్మీయ సమావేశం జరిగింది. డివిజన్ ప్రముఖులు, పార్టీ నేతలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సమస్యలను మంత్రి గారి దృష్టికి తీసుకొని వచ్చారు. విశ్రాంత ఉద్యోగులు తమకు ఒక భవనాన్ని నిర్మించి అందులో చదువుకొనేందుకు పత్రికలు అందుబాటులో ఉంచాలని కోరగా మంత్రి గారు స్పందిస్తూ మీరే డివిజన్ లో స్థలాన్ని చూపినట్లైతే భవనాన్ని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. మరికొందరు శ్రీనగర్ ప్రాంతంలో ఒక ఆలయాన్ని నిర్మించి ఇవ్వాలని కోరగా మంత్రి గారు బదులిస్తూ దాని గురించి పరిశీలిస్తామన్నారు. బ్రాహ్మణ సామాజిక వర్గం నేతలు తమకు ఒక కర్మ క్రతువుల భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరగా దానికి మంత్రి అనిల్ కుమార్ గారు సమాధానం ఇస్తూ కర్మ క్రతువుల భవనాన్ని నిర్మిస్తామని, అలాగే ఒక ఆలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ పదవిని బ్రాహ్మణ వర్గానికి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఉస్మాన్ సాహెబ్ పేటలోని శివాలయం ట్రస్ట్ బోర్డులో తమకు ప్రాతినిధ్యం కల్పించడం పట్ల బ్రాహ్మణ నేతలు మంత్రి గారికి ధన్యవాదాలు తెలిపారు. మరి కొందరు 14వ డివిజన్ లోని పలు ప్రాంతాలలో రోడ్లు దెబ్బతిని గుంటలు మిట్టలుగా ఉన్నాయని వీటిని మరమ్మత్తులు చేయించాలని, విద్యుత్ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అందరి సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి గారు హామీ ఇవ్వడం పట్ల ఆత్మీయ సమావేశానికి హాజరైన వారు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజన్ వైసీపీ ఇంచార్జ్ కర్త0 ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మీయ సమావేశానికి సమయం కేటాయించినందుకు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారికి కృజ్ఞతలు తెలపడంతోపాటు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు డివిజన్ ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని అమరావతిలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన స్వచ్ఛ ఆంధ్ర ప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పొణకా దేవసేనమ్మ , వైయస్సార్ సిపి నాయకులు, ప్రముఖ పారిశ్రామిక వేత్త పొణకా శివ కుమార్ రెడ్డి, యువ నాయకులు పొణకా దివ్య తేజ రెడ్డి లు.
తేది:21-07-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, పొదలకూరు మండల కేంద్రంలో "జగనన్న పచ్చతోరణం" కింద మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించిన వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.
పారిశుద్ధ్య కార్మికులకు గతంలో బకాయిలు ఉన్న జీతాలతో పాటు, బట్టలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
పొదలకూరు మండల కేంద్రంలోని వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలను పరిశీలించి, కళాశాలకు, వసతి గృహాల్లో ఉన్న విద్యార్థిని, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను కోరిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో "జగనన్న పచ్చ తోరణం" పేరిట 35,653 మొక్కలు నాటేందుకు 5కోట్ల 58 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో రైతులు సాగు చేసే నిమ్మ, బత్తాయి లాంటి ఉద్యానవన పంటలకు 5కోట్ల 62లక్షల రూపాయలు మంజూరు చేశాం.
👉 చెట్ల పెంపకాన్ని మొక్కుబడిగా కాకుండా "సామాజిక ఉద్యమం" లా చేపట్టాలి.
👉 చెట్లు పెంచక, ఉన్న చెట్లను తొలగించడంతో పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుంది.
👉 చెట్లు లేనందువల్ల ఆక్సిజన్ సరిగా అందక, మానవాళి కృత్రిమ ఆక్సిజన్ కొరకు డబ్బులు చెల్లించవలసిన దుర్భర పరిస్థితులు నెలకొంటున్నాయి.
👉 జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు సమగ్రంగా అమలు చేయడంతోపాటు, ప్రజలకు అవసరమైన, సూక్ష్మమైన, ఆరోగ్యపరమైన వసతులు కల్పించడంలో భాగమే "జగనన్న పచ్చతోరణం" పధకానికి శ్రీకారం.
👉 ప్రభుత్వం చెట్లు నాటించి, కాపలాదారునితో పాటు, మొక్కలు బతకడానికి అవసరమైన నీరు పోసేందుకు, నెలకు చెట్టుకు దాదాపు 30 రూపాయలు చెల్లించేందుకు ముందుకు రావడం సంతోషించదగ్గ పరిణామం.
👉 గతంలో క్లిన్ అండ్ గ్రీన్ అంటూ ఆర్భాటమైన ప్రకటనలు ఇచ్చిన వారు, సమాజాన్ని క్లీన్ చేయలేక, ప్రజల చేతుల్లో వాళ్లే క్లీన్ అయిపోయారు.
👉 గ్రామ పంచాయతీ సర్పంచులు, వార్డు మెంబర్లు, స్థానిక నాయకులు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రకృతి ప్రేమికులు, అధికారులు అందరూ సమన్వయంతో మొక్కలు నాటించి, నాటిన మొక్కలను సంరక్షించి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని "సుందరవనం" గా తీర్చిదిద్దడానికి అందరం కలిసి పని చేద్దాం.
కావలిలో కర్ఫ్యూ
🔹 ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : ఎమ్యెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
---------------------------------------------------------
దేశంలో మూడవ వేవ్ ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో కావలి నియోజకవర్గంలోను , కావలి రెవెన్యూ పరిధిలోను 23 వతేది శుక్రవారం సాయంత్రం 6 గంటలనుండి ఉదయం 6 వరకు కర్ఫ్యూ విధించడానికి నిర్ణయం తీసుకున్నట్లు కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాపకుమార్ రెడ్డి వెల్లడించారు . కావలి ఆర్డీఓ కార్యాలయంలో బుధవారం జరిగిన కరోన సమీక్షాసమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగించారు . కావలిలో కరోన కేసులు పెరుగుతున్న దృష్ట్యా వ్యాపారస్తుల కొరికమేరకు ఆర్డీఓ ఈ నిర్ణయం గైకొన్నట్లు ఆయన తెలిపారు . కావలిలోని వ్యాపారవర్గాల ప్రతినిధులు వచ్చి తమను కలిసారన్నారు . కరోన థర్డ్ వేవ్ ఉధృతంగా వుంటుందని మేధావులు హెచ్చరికలు చేస్తున్నందున కరోన నియంత్రణకు తామంతా స్వచ్చందంగా దుకాణాలకు మూసివేయడానికి నిర్ణయించుకొన్నామని వ్యాపారస్తులు చెప్పడంతో - కర్ఫ్యూ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు . ఆర్డీఓ శ్రీను నాయక్ , డీఎస్పీ ప్రసాదరావు , కమీషనర్ శివారెడ్డి , డిప్యూటీ డీఎం & హెచ్ ఓ , మరికొందరు అధికారులు వ్యాపారస్తులు ఈ సమావేశంలో కరోన నియంత్రణ సమస్యపై చర్చించామన్నారు .
విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ : ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథరెడ్డి
జులై, 21 : నెల్లూరు జిల్లా లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ అందిస్తున్నామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి చెప్పారు. స్థానిక రాష్ట్ర ప్రెస్ అకాడమీ కార్యాలయంలో బుధవారం విక్రమ సింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ కృష్ణారెడ్డి తో కలిసి జర్నలిజం సర్టిఫికెట్ కోర్స్ కు సంబందించిన బ్రోచర్ ను శ్రీనాధరెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా శ్రీనాథ్ రెడ్డి మాట్లాడుతూ ప్రెస్ అకాడమీ ద్వారా రాష్ట్రంలోని 6 వేల మందికి శిక్షణ అందియించడం జరిగిందని, 5 వేల మందికి జర్నలిజం పై ముద్రించిన పుస్తకాల పంపిణీ చేయడం జరిగిందన్నారు. చాలా మంది విలేఖరులు పీడీఎఫ్ రూపంలో ఉన్న పుస్తకాలను డౌన్లోడ్ చేసుకున్నారన్నారు. మారుతున్న కాలానికనుగుణంగా ప్రెస్ అకాడమీ తన కార్యక్రమాలను మార్పు చేసుకుంటున్నదన్నారు. విలేకరులకు ఏ రకమైన శిక్షణ అవసరమో తెలుసుకుని, తమ కార్యక్రమాలను మార్చుకుంటున్నామన్నారు. గ్రామీణ విలేఖరులకు జర్నలిజం పై ప్రాధమిక అవగాహనకు, జర్నలిజం పై ఆసక్తి ఉన్న వారికి అనుకూలంగా ఉండే విధంగా జర్నలిజం లో సర్టిఫికెట్ కోర్స్ ను నెల్లూరు లోని విక్రమసింహపురి యూనివర్సిటీ ద్వారా అందిస్తున్నామన్నారు. జర్నలిజం కోర్స్ నడిపే యూనివర్సిటీ కళాశాలల్లో సంవత్సరం పాటు కాలం వెచ్చించడం , హాజరు, అధిక ఫీజు, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని, యూజీసీ గైడ్ లైన్స్ కు అనుగుణంగా సర్టిఫికెట్ కోర్స్ రూపొందించడం జరిగిందన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితులలో క్లాసులకు వెళ్లడం కష్టతరం కావున ఆన్లైన్ క్లాస్ ల ద్వారా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కోర్స్ లో మొత్తం 4 పేపర్ లు ఉంటాయని, జర్నలిజం లో రచన నైపుణ్యం, రిపోర్టింగ్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఎడిటింగ్ , కొత్తగా వచ్చిన సోషల్ మీడియా, యు ట్యూబ్ , ఇన్స్టాగ్రామ్ అంశాలతో న్యూ మీడియా పేరుతో 4వ పేపర్ ఉంటాయన్నారు. ఒక్కొక్క పేపర్ కి 20 గంటలు, మొత్తం కోర్స్ కి 80 గంటలపాటు శిక్షణ ఉంటుందన్నారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలలో జర్నలిజం బోధించే ప్రొఫెసర్లు, జర్నలిజం లో అనుభవం, మంచి పేరున్న జర్నలిస్ట్ లతో క్లాసులు నివహించడం జరుగుతుందన్నారు. స్టడీ మెటీరియల్ కూడా సరఫరా చేస్తామన్నారు. వివిధ వార్తా సంస్థలలో ఇంటీరియం శిక్షణ అందించడం జరుగుతుందన్నారు. ఉతీర్ణులైనవారికి వివిధ మీడియా సంస్థలలో ఉపాధికి కూడా సహకరిస్తామన్నారు. ఈ కోర్స్ 3 నెలల పాటు ఉంటుందన్నారు. అనంతరం రాష్ట్రంలోని ప్రముఖ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. వర్కింగ్ జర్నలిస్ట్ లకు 1500 రూపాయలు, డిగ్రీ చదివి వర్కింగ్ జర్నలిస్ట్స్ కానివారికి కూడా అవకాశం ఉందని వారికీ 3000 రూపాయల కోర్స్ ఫీజుగా నిర్ణయించడం జరిగిందన్నారు. గ్రామీణ ప్రాంత విలేఖరులు, జర్నలిజం పై ఆసక్తి ఉన్నవారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని శ్రీనాధ్ రెడ్డి విజ్ఞప్తి చేసారు.
నెల్లూరు విక్రమసింహపురి యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఎల్.వి. కృష్ణారెడ్డి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలలో పనిచేసే ఆచార్యుల కమిటీ ఈ కోర్స్ సిలబస్ రూపొందించిందన్నారు.
ఈ కోర్స్ సర్టిఫికెట్ కు గుర్తింపు ఉంటుందన్నారు. ఈ కోర్స్ కు దరఖాస్తు చేసేందుకు వర్కింగ్ జర్నలిస్టులకు ఇంటర్మీడియట్, జర్నలిస్ట్ కానివారు డిగ్రీ ఉతీర్ణులై ఉండాలన్నారు. 20 క్లాసులు పూర్తి అయ్యాక అసైన్మెంట్ లు రాయవలసి ఉంటుందని, 30 మార్కులు చొప్పున ఉంటాయని, తుది పరీక్షలకు ఒక్కొక్క సబ్జెక్టు కు 70 మార్కులు ఉంటాయన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 22వ తేదీన నోటిఫికేషన్ జారీ చేస్తామని, దరఖాస్తుకు చివరి తేదీ ఆగష్టు 20వ తేదీచెప్పారు అని కృష్ణారెడ్డి చెప్పారు. ప్రెస్ అకాడమీ కార్యదర్శి కె.బి.జి. తిలక్, ప్రభృతులు పాల్గొన్నారు.
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో నుడా చైర్మన్ గా నియమితులైన ముక్కాల ద్వారకానాధ్ గారు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నుడా చైర్మన్ గా నియమితులైన ముక్కాల ద్వారకానాధ్ గారిని ఎమ్మెల్యే కాకాణి అభినందించారు.