పత్రికా ప్రకటన
తేదీ: 01-06-2021,
ఆత్మకూరు, శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా.
కోవిడ్- 19 సోకిన రోగులకు అందుతున్న చికిత్స గురించి అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి
సోను సూద్ ఆధ్వర్యంలో ఏర్పాటు కానున్న ఆక్సిజన్ ప్లాంట్ స్థలాన్ని పర్యవేక్షించిన మంత్రి మేకపాటి
ఆత్మకూర్ టిడ్కో కేర్ సెంటర్ లో భోజనం సహా ఇతర సదుపాయాలపై అక్కడి ప్రజలను అడిగి తెలుసుకున్న మంత్రి గౌతమ్ రెడ్డి
ఏరియా ఆసుపత్రి మొత్తం కలియతిరుగుతూ ప్రత్యక్షంగా అక్కడి సదుపాయాలను పర్యవేక్షించిన పరిశ్రమల శాఖ మంత్రి
రోగులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా, ఏ విధమైన ఇబ్బంది వచ్చినా అందుబాటులో ఉన్న అధికారులను మాత్రమే సంప్రదించాలని తెలిపిన మంత్రి గౌతమ్ రెడ్డి
అత్యవసర విభాగం సహా ఆక్సిజన్, వెంటిలేటర్ విభాగం, వ్యాక్సిన్ ప్రక్రియ నిర్వహించే ప్రాంగణాలను పరిశీలించిన మంత్రి మేకపాటి
ఆస్పత్రిలో కరోనా చికిత్స పొందుతున్న వారిని పలకరించిన మంత్రి మేకపాటి
ఆత్మకూరు ఆసుపత్రిలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెడ్ల వివరాలను అడిగి తెలుసుకున్న మంత్రి మేకపాటి
ఇటీవల విశాఖపట్నం ద్వారా ఆత్మకూరు ఏరియా ఆసుపత్రికి అందిన ఆక్సిజన్ కాన్సెంట్రేటర్లని పరిశీలించి, వాటి పనితీరును పర్యవేక్షించిన మంత్రి గౌతమ్ రెడ్డి
ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు, వైద్యులు, ప్రజలు ఇదే పద్ధతిలో మరింత చొరవ తీసుకుని శ్రమిస్తే కరోనాని నియంత్రించగలమని వెల్లడించిన మంత్రి మేకపాటి
కరోనా సోకి చికిత్స పొందుతున్న వారికి అక్కడ నోడల్ ఆఫీసర్ లు, వైద్యులు, నర్సులు సహా ఇతర సిబ్బంది అందుబాటులో ఉన్నారా లేదా అని ఆరా తీసిన మంత్రి మేకపాటి
కోవిడ్ కి సంబంధించి మరిన్ని సౌకర్యాల ఏర్పాటుకు అవసరమైన ప్రతిపాదనలను జాయింట్ కలెక్టర్, ఆర్డిఓ, మున్సిపల్ కమిషనర్ ల ద్వారా తీసుకున్న మంత్రి మేకపాటి
ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ గణేష్ కుమార్ (అభివృద్ధి), ఆర్డీఓ చెైత్ర వర్షిణి, డీఎస్పీ వెంకటేశ్వరరావు, మున్సిపల్ కమిషనర్ ముప్పాళ్ల రమేష్ బాబు, ఆర్ఎంవో, నియోజకవర్గ, మండల స్థాయి వైసీపీ నాయకులు,తదితర అధికారులు హాజరు