తమిళనాడులోని తిరుపూర్ జిల్లాలోని తిరుమూర్తి ఆనకట్ట దగ్గర నీళ్ల కోసం వచ్చిన ఏనుగులను స్థానిక గిరిజన యువకులు కొందరు తీవ్రంగా హింసించారు. ఏనుగుల మీదికి వేట కుక్కలను వదలడంతో పాటు రాళ్లతో కొడుతూ రాక్షసానందం పొందారు. ఈ దారుణాన్ని దూరంగా కొండపై నుంచి కొందరు వీడియో తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు 14 వ ముఖ్యమంత్రిగా ఎంకే స్టాలిన్ శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. స్టాలిన్‌తోపాటు 34 మంది మంత్రులతోనూ గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. స్టాలిన్ క్యాబినెట్‌లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. హోం, సాధారణ ప్రజా వ్యవహారాల నిర్వహణ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తదితర విభాగాలను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, చెపాక్ నుంచి విజయం సాధించిన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు మాత్రం ఏ పదవీ ఇవ్వలేదు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టిడిపి ఎం చేశామో చెవుకోలేని పరిస్థితి ఉన్నారని మంత్రి అదిమూలపు సురేష్ ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా ఆయన నెల్లూరు మాగుంట లేఔట్ వైయస్సార్ కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏం చేయబోతామో బిజెపి చెప్పలేక పోయిందని మేము చేసిన అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వెళ్లి ధైర్యంగా చెప్పంగలిగాంమని మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారో మీకే తెలుసు ఇలాంటి పార్టీల గురించి మాట్లాడడం దురదృష్టకరంమని ఆయన అన్నారు. 17 వ తేది తర్వాత టిడిపి ఉండదని ఎపి అధ్యక్షులు అచ్చెన్నాయుడు చెప్పాడు. ఆ వీడియోలో ఉన్న సారాంశం నిజమా కాదా, ఎందుకు చంద్రబాబు, లోకేష్ మాట్లాడడం లేదో అర్ధం కావడం లేదు అని ఆయన అన్నారు.
ఎం.ఎస్.ఆర్ సేవాసమితి వ్యవస్థాపకులు మాగుంట శరత్ చంద్ర రెడ్డి పుట్టినరోజు సందర్భంగా నెల్లూరు నగరం లో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎం. ఎస్.ఆర్ సేవాసమితి సభ్యులు రక్తదానం,అన్నదానం,వస్త్ర దానం,మొక్కలు నాటే కార్యక్రమం చేశారు. గౌడ్ హాస్టల్ సెంటర్ నందు కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా ఎం.ఎస్.ఆర్ సేవాసమితి అధ్యక్షులు సాయి బాబు మాట్లాడుతూ మాగుంట శరత్ చంద్ర రెడ్డి పిలుపు మేరకు మన ఊరు మన బాధ్యత కార్యక్రమం లో బాగంగా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేపడతామని తెలిపారు, గత ఎనిమిది ఏళ్లు గా నీరు పెద్ద విద్యార్థులకు కళాశాల ఫీజులు చెల్లించడం తో పాటు పలువురు దీర్ఘ కాలిక వ్యాధి గ్రస్తులకు వైద్య సహాయం చేయడం జరుగుతున్నది వేసవి కాలం లో దాహార్తిని తీర్చేందుకు చలి వెంద్రలు ఏర్పాటులు వినూత్న మైన కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది రాజకీయం గా ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా ప్రజల తరుపున కోరుచున్నాము ఈ కార్యక్రమం లో మని తేజ రెడ్డి, మహేష్,రాఘవ,నిశాధ్,యశ్వంత్, సాయిరాం,గణేష్,సుమన్ తదితరులు పాల్గొన్నారు.