తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా గూడూరు నియోజకవర్గం, చిట్టమూరు మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీగూడూరు లోని చిట్టమూరు మండలం కొంతగుంట లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గురు మూర్తి ప్రచారం .
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జగన్ అన్న నిలబెట్టిన డాక్టరు గురు మూర్తి నీ భారీ మెజారిటతో గెలిపించాలని కోరిన
మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు..
హాజర అయిన మంత్రులు పేదిరెడ్డి , నారాయణ స్వామి ,టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి ...
మాజీ మంత్రి, కోవూరు శాసనసభ్యులు
నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు
తేది:04-04-2021
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండల కేంద్రంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులతో పాటు తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల్లో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన డా౹౹గురు మూర్తి గారికి అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రచారం నిర్వహించిన వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి
👉 ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ధాటికి తట్టుకోలేక చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటూ పలాయనం చిత్తగించాడు.
👉 ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంతృప్తిగా ఉన్న ప్రజలు, జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచి, చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేందుకు సిద్ధమయ్యారు.
👉 చంద్రబాబు, తెలుగుదేశం నాయకులు సిద్ధాంతాలు లేకుండా వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీని ఓడించడమే ధ్యేయంగా పని చేస్తున్నారు.
👉 చంద్రబాబు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చినప్పటికీ లెక్కచేయకుండా, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ప్రచారం నిర్వహించుకుంటూ, తెలుగుదేశం పార్టీ పోటీ లేని చోట్ల ఇతర పార్టీలకు మద్దతు ఇస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు ధాన్యం దొంగల అవతారమెత్తి, రైతులను దోచుకోవడంతో జైలుపాలయ్యారు.
👉 వ్యవసాయ శాఖ మంత్రిగా పనికిరాని ఉత్తర్వులు ఇచ్చి, ప్రలోభపెట్టే ప్రయత్నం చేసి, రైతుల చేత తిరస్కరింపబడిన వ్యక్తి, రైతుల గురించి ముసలి కన్నీరు కారుస్తున్నాడు.
👉 వ్యవసాయ శాఖ మంత్రిగా రైతులను అడ్డుపెట్టుకొని, గిట్టుబాటు ధర కల్పించకుండా, నీరు-చెట్టు, రైతు రథం లాంటి కార్యక్రమాల పేరిట వందల కోట్లు ప్రజా సొమ్ము దోచుకున్నాడు.
👉 అవినీతి సంపాదన ద్వారా వచ్చిన సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేసి, అందలమెక్కాలని ఆశపడ్డ వారికి, ఘోరపరాజయం తప్పలేదు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అందించడంతోపాటు, కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలిచి 3 కోట్ల 50 లక్షల విలువైన బియ్యం, వంటనూనెను పంపిణీ చేశాం.
👉 కరోనా నేపథ్యంలో ప్రాణాలు సైతం లెక్క చేయకుండా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా భావించి మేము పని చేస్తే ,తెలుగుదేశం నాయకులు తమకు ఎక్కడ కరోనా వస్తుందోనని ముసుగుతన్ని పడుకొని, ప్రజలను పట్టించుకోకుండా వదిలేశారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గాన్ని "సోమిబాబా-తెలుగు దొంగలు" అధికారాన్ని అడ్డుపెట్టుకొని, పంచభూతాలను దోపిడీ చేశారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గంలో నాయకులు, కార్యకర్తలు అందరం కష్టించి పనిచేసి, అత్యధిక పోలింగ్ శాతం సాధించడంతో పాటు, తిరుపతి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి గారికి భారీ మెజారిటీ సాధించేందుకు తీవ్రంగా కృషి చేద్దాం.
👉 ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు, తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, అత్యధిక మెజారిటీతో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేసి, సర్వేపల్లి నియోజకవర్గాన్ని అగ్రభాగాన నిలుపుదాం.
మాజీ ఆర్థికశాఖామాత్యులు
👉చంద్రబాబు దివాలాకోరు రాజకీయాలతో ఏపీ లో కూడా టీడీపీ భూస్థాపితం అయిపోయింది
👉చంద్రబాబు తీరువల్ల బయటకు రావాలంటేనే టీడీపీ నేతలు సిగ్గుపడుతున్నారు
అధినేత అస్త్రసన్యాసంతో దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్న ఆ పార్టీ నేతలను చూస్తే బాధేస్తోంది
👉తెలుగుజాతికోసం ఎన్టీఆర్ పార్టీని స్థాపిస్తే సిద్ధాంతాలను గాలికొదిలేసిన చంద్రబాబు ఒక్కరోజులో పార్టీని చంపేశాడు
👉జెడ్పిటిసి ,ఎంపీటీసీ ఎన్నికల కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్న టిడిపి అభ్యర్థులను ముహూర్తం పెట్టి బలిఇచ్చేసాడు
రాజకీయాల్లో హత్యలుండవు ,ఆత్మహత్యలే ఉంటాయి
ఆ మాటను ఇప్పుడు చంద్రబాబు నిజం చేసాడు
👉ప్రపంచంలో ఏ రాజకీయపార్టీ కూడా ఇలాంటి తప్పుచేయలేదు .
చంద్రబాబు ఆత్మహత్యా సదృశ్యం తో ఆ పార్టీ ఎన్నికల్లో ఉన్నట్టా లేనట్టా అన్న ప్రశ్న తలెత్తుతోంది
👉అయోమయంలో ఉన్న టీడీపీ నేతలను ,కార్యకర్తలను ఓదార్చి వైఎస్సార్సీపీ శ్రేణులు అండగా నిలవండి ..
మనపార్టీలోకి ఆహ్వానించి సంక్షేమం లో భాగస్వామ్యులను చేయండి
👉దివాలాకోరు రాజకీయాలు చేసే టీడీపీ తన హయాంలో సోమశిల ,స్వర్ణ ముఖి లింక్ కెనాల్ కు తిలోదకాలిచ్చేసింది
👉దివంగత వైఎస్సార్ హయాం లొ ప్రారంభమైన సోమశిల స్వర్ణముఖి కెనాల్ కు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి
470 కోట్లతో పనుల ప్రారంభానికి సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు
👉ఆ కెనాల్ పూర్తయితే రెండుజిల్లాల్లో సాగు ,తాగునీటి సమస్య తీరుతుంది
👉రాష్ట్రంలో అన్ని వర్గాల సంక్షేమాన్ని సీఎం వైఎస్ జగన్ చూస్తున్నారు
👉పార్టీలతో సంబంధం లేకుండా సంక్షేమం పేదలందరి చెంతకే చేరుస్తున్నారు
👉రిజర్వేషన్ కంటే ఎక్కువస్థానాల్లో అవకాశం ఇచ్చి మహిళా సాధికారతకు సీఎం వైఎస్ జగన్ పెద్దపీట వేశారు
👉టీడీపీ అగ్రనేతలు కనిపించని నాలుగో సింహాలుగా తమని తాము అభివర్ణించుకోవటం హాస్యాస్పదం
👉ఉగ్రనరసింహావతారం లాంటి వైఎస్సార్సీపీ ముందు పార్టీ పరువుతీసుకొన్న టీడీపీ నేతలు గ్రామసింహాలతో సమానం
👉జెడ్పిటిసీ ,ఎంపిటిసి బరినుంచి తప్పుకొని తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలా ఓట్లు అడుగుతారు
👉వైఎస్సార్సీపీ అభ్యర్థి గురుమూర్తిని దీవించి అఖండ మెజారిటీతో గెలిపించండి...డక్కిలి మండల వై ఎస్ ఆర్ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం లో మాజీ మంత్రివర్యులు వెంకటగిరి శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి
6వ తేదీ మొదలు కాబోతున్న
👉ప్రతి సంవత్సరం ఉగాదికి ముందర వచ్చే మంగళవారం నుండి శుక్రవారం వరకు అమ్మవారి జాతర మహోత్సవం
👉గత సంవత్సరం కూడా కోవిడ్ దృష్ట్యా జాతర ను నిలిపివేసిన అధికారులు కు ఈ సంవత్సరం కూడా కోవిడ్ సెకండ్ వేవ్ తో షరతులు తో కూడిన అనుమతులు మంజూరు
👉అమ్మ వారి పూజా కైంకర్యాలు యధావిధిగా జరుగుతాయి,ఆలయానికి వచ్చే భక్తులు కోవిడ్ నిబంధనలు పాటించి మాస్క్ లు ధరించి,సామాజిక దూరం పాటించండి..భక్తులకు ఆలయ అధికారులు విజ్ఞప్తి
ఈరోజు చిల్లకూరు మండలం లో వెలసియున్న శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం కి సంబంధించి వివరాలు వెల్లడించిన ఆలయ చైర్మన్ మరియు దేవాదాయ శాఖ అధికారులు,కోవిడ్ నిబంధనలుకు లోబడి భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉగాదికి ముందు మంగళవారం నుంచి శుక్రవారం వరకు జరిగే కనుపూరు శ్రీ ముత్యాలమ్మ జాతరకు చుట్టుపక్కల గ్రామాలు మాత్రమే హాజరు కావాలని బయటి ప్రాంతాల ప్రజలు జాతరకు అనుమతులు లేవని కోవిడ్ సెకండ్ వేవ్ దృష్ట్యా భక్తులకు ప్రత్యేక ఏర్పాట్లు పూర్తి చేశామని కావున ప్రజలు కూడా అర్థం చేసుకొని ఆలయానికి వచ్చే వారు అందరూ మాస్కులు ధరించి కోవిడ్ నియమాలు పాటించాలని ఆలయ చైర్మన్ మురళి మోహన్ రెడ్డి కోరారు... అలాగే ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గూడూరు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో లో కనుపూరు జాతర మహోత్సవానికి సంబంధించి రెండుసార్లు అన్ని శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి కోవిడ్ దృష్ట్యా నిబంధనలకు అనుగుణంగా జాతర జరుపుకోవాలని ఆదేశాలు జారీ చేశారని కావున ఈసారి భక్తుల సంఖ్య లో కూడా పరిమితులు ఉన్నాయని కాబట్టి ప్రజలు అర్థం చేసుకుని నియమాలు పాటిస్తూ అమ్మవారి దర్శనానికి రావాలని ఈవో జనార్దన్ రెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు సాయి కృష్ణా రెడ్డి,గౌడ్ తదితరులు పాల్గొన్నారు...
నలుగురు జూదదారులు అరెస్ట్ నలుగురు పరార్.
2 బైకులు, 4 సెల్ ఫోన్లు, 57.510, నగదు స్వాధీనం.
నాయుడుపేట సెబ్ సిఐ అబ్దుల్ జలీల్.
పెళ్లకూరు మండలం శిరసనంబేడు విలేజ్ కానూరు ఎస్సీ కాలనీ వద్ద అడవి ప్రాంతాల్లో జూదం ఆడుతున్నారని వచ్చిన సమాచారంతో సెబ్ పోలీసులు సీఐ అబ్దుల్ జలీల్ తన సిబ్బందితో అక్కడికి చేరుకొని పేకాట కేంద్రంపై దాడి చేసి అక్కడ పేకాట ఆడుతున్న 4 జోధా దారులను అదుపులోకి తీసుకొని 4 పరారు కాగా వారి వద్ద నుండి 4 సెల్ఫోన్లను 57,510 నగదును 2 బైకులు స్వాధీనం చేసుకున్నారు. సెభ్ జాయింట్ డైరెక్టర్ శ్రీలక్ష్మి ఆదేశాల మేరకు సీఐ అబ్దుల్ జలీల్ తన సిబ్బందితో ఆదివారం తెల్లవారుజామున పేకాట కేంద్రాలపై దాడి చేసి తనిఖీలు నిర్వహించగా అక్కడ జూదం ఆడుతున్న 4 మంది పేకాటరాయుళ్ల పట్టుబడ్డారు. వాళ్ళ పై కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ అబ్దుల్ జలీల్ తెలియజేశారు ఈ దాడుల్లో అధికారులు ఎస్సై శేషమ్మ వారి సిబ్బంది ఉన్నారు..