విడవలూరు మండలం, ఊటుకూరు పెద్దపాళెం తెలుగుదేశం పార్టీ MPTC అభ్యర్థి కోడి గోవిందమ్మ వారి భర్త కోడి ఏడుకొండలు ని మాజీ మంత్రి,
🟢 తిరుపతి ఉపఎన్నిక: తెదేపా విస్తృత ప్రచారం.. గెలుపే లక్ష్యంగా అడుగులు!
🟡 బస్సులో ప్రయాణికుల వద్దకు నేరుగా వెళ్లి ప్రయాణికులను పలకరిస్తున్న ఓట్లను అభ్యర్థిస్తూన్న పనబాక
🟢 పనబాక లక్ష్మికి బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
🟡 విన్నూతనా రీతిలో ప్రచారంలో దూసుకుపోతున్న పనబాక
🟢 7 నియోజకవర్గ పరిధిలో ప్రచారంలో దూసుకుపోతున్న పనబాక
🟡 గెలుపే లక్ష్యంగా పనబాక ప్రచారం
తిరుపతి ఉపఎన్నికల్లో తెదేపా వేగం పెంచింది. ప్రచారాన్ని విస్తృతం చేయడంతో పాటు గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తోంది. అధికార వైకాపా దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడుతున్న కార్యకర్తలకు బాసటగా పార్టీ నిలుస్తోందన్న సంకేతాలను పంపుతోంది. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన పనబాక లక్ష్మీ ఆ రోజు నుండే ఎన్నికల ప్రచారంలోదూసుకుపోతున్నారు, తిరుపతి పార్లమెంట్ పరిధిలోని7నియోజకవర్గాలలో ర్యాకెట్ లా ఎన్నికల ప్రచారంలోదూసుకుపోతున్నారు పనబాక లక్ష్మీ
స్థానిక అంశాలను ప్రస్తావిస్తూనే రాష్ట్ర వ్యాప్త సమస్యలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో పనబాక ప్రచారాన్ని చేపట్టారు. ఇటీవల తెదేపా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించడం ద్వారా కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపారు. మండల కేంద్రాలలో ,గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల ప్రక్కనున్న టిఫిన్ సెంటర్లలో బజ్జిలు,దోసెలు వేస్తూ విన్నూతనా ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటూ ప్రచారంలో పనబాక లక్ష్మి సత్తా ఏమిటో చూపిస్తున్నారు.
తిరుపతి ఉప ఎన్నికల్లో విజయం కోసం తెదేపా సర్వశక్తులు ఒడ్డుతోంది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థిని ప్రకటించడంతో పాటు నామినేషన్ ఘట్టాన్ని పూర్తి చేసిన తెదేపా.. ప్రచారాన్ని విస్తృతం చేసింది. రాష్ట్ర స్థాయి నేతలు తిరుపతి ఉప ఎన్నికపై ప్రత్యేక దృష్టి సారించారు. మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, అమరనాధ్ రెడ్డి ,సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి లతో పాటు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో తమ సత్తా ఏంటో చాటుతున్నారు, తిరుపతిలోనే మకాం వేసి ప్రచారాన్ని పర్యవేక్షిస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు శాసనసభ స్థానాల్లో స్థానిక నేతలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
అదేవిధంగా అభ్యర్థి పనబాక లక్ష్మి.. స్థానిక నేతలతో కలిసి ప్రచారం లో పాల్గొంటున్నారు. మరో వైపు క్లస్టర్ స్థాయిలో కార్యకర్తలు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. నలభై సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన తెదేపా నేతలు.. ఉప ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. తిరుపతి పవిత్రతను కాపాడటంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని.. ఇదే అంశాన్ని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు సూచించారు. అమ్మ ఒడి పేరుతో సంక్షేమ పథకం అమలు చేశామంటున్న ప్రభుత్వం మద్యం మొదలు నిత్యావసరాల వరకు ధరలను పెంచడం ద్వారా సామాన్య ప్రజలకు దోపిడీ చేస్తోందని.. ఈ అంశాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలను నిర్దేశించారు.ప్రముఖ నేతల భారీ ర్యాలీలు రోడ్‌షోలతో పాటు క్షేత్ర స్థాయిలో కార్యకర్తలు ఇంటింటా ప్రచారం నిర్వహిస్తున్నారు.
పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు చేరువచేసేందుకు ప్రత్యేకంగా ప్రణాళిక రూపొందించి అమలు చేస్తున్నారు. శనివారం సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తో కలిసి పనబాక లక్ష్మీ రోడ్డుషో నిర్వహించారు, పనబాక లక్ష్మికి టిడిపి నేతలు, కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు, ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల బరిలో ఉన్న పనబాక లక్ష్మి విజయానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.
వైకాపా అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి తెదేపా అభ్యర్థి గెలుపుకోసం విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. అమరావతిలో నిర్మించిన భవనాలను శిథిలావస్థకు తీసుకువచ్చారని దుయ్యబట్టారు. ట్రాక్టర్ ఇసుక ధర రూ. 7 వేలు పలుకుతోందన్నారు. కేంద్ర మాజీ మంత్రి, తిరుపతి అభ్యర్థిని పనబాక లక్ష్మి మాట్లాడుతూ విశాఖ ఉక్కు, బ్యాంకులతో సహా ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటుపరం చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేకుండా చేశారన్నారు.
అనంతరం మనుబోలు పట్టణంలో టీడీపి ఎంపి అభ్యర్థి పనబాక లక్ష్మి , మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మనుబోలు టీడీపి నాయకుల తో కలసి రోడ్ షో చేపట్టి టిడిపి నేతలు, కార్యకర్తలు ,అభిమానుల్లో జోష్ పెంచారు.బజార్ సెంటర్ వద్ద ప్రతి అంగళ్ళలలో వ్యాపారస్తులకు పనబాకలక్ష్మి ఎన్నికల కరపత్రాలు ఇచ్చి ఓటు ను అభ్యర్ధించారు.
ఆర్టీసీ బస్సులో పనబాక ప్రచారం
మనుబోలు తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమిరెడ్డి తో కలిసి పనబాక లక్ష్మీ రొడ్డషో నిర్వహించారు అందులో భాగంగానే పనబాక లక్ష్మీ బస్సులో ప్రయాణికుల వద్దకు నేరుగా వెళ్లి ప్రయాణికులను పలకరిస్తూ ఓట్లు అభ్యర్ధించారు,ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె కోరారు, పనబాక ప్రచారానికి భారీ స్థాయిలో ఆదరణ రావడంతో పార్టీకి బాగా జోష్ పెరిగింది.
నేడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో 32వ డివిజన్, టైలర్స్ కాలనీకి చెందిన మహిళా నాయకురాళ్ళూ మంజుల, దేవసేనమ్మ మరియు వారి మిత్రబృందం రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్
🔹 ఈరోజు పార్టీలో చేరిన వారందరి గౌరవం ఏమాత్రం తగ్గకుండా, రాజకీయంగా వారి ఎదుగుదలకు తోడ్పాటు అందిస్తా. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 త్వరలో జరగబోవు ఎమ్.పి.టి.సి., జెడ్.పి.టి.సి. ఎన్నికలలో నెల్లూరు రూరల్ ప్రజలందరి సహకారంతో 100 కి 100 శాతం గెలుస్తాం. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి గారికి, రూరల్ ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటున్న శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మీ అందరి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలి. రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి.
ఇంటింటి నుంచి చెత్త సేకరించేందుకు కార్పొరేషన్ సిబ్బంది ఒక్కో ఇంటికి 40 రూపాయలు వసూలు చేస్తున్నారని సిటి ఇన్చార్జి కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి మండిపడ్డారు.. జగన్ ప్రవేశపెట్టిన నవరత్నాల్లో చెత్తసేకరణకు 40 నుంచి వేల రూపాయలు వసూలు చెయ్యడం కూడా ఒక రత్నమని ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు.. నెల్లూరులోని మినిబైపాస్ రోడ్డులో ఉన్న పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.. కొత్తగా ఏర్పాటు చేసిన సచివాలయాల ఖర్చులను కార్పొరేషన్ కు అప్పగించడతో,, దాన్ని పూడ్చుకునేందుకు కార్పొరేషన్ అధికారులు పన్నులు పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఒక్కో సచివాలయానికి మెయింటైన్స్కు నెలకు 20లక్షల దాకా ఖర్చు అవుతుందన్నారు..దాన్ని పూడ్చుకునేందుకు ఇలా ప్రజలను పీల్చుకు తింటున్నారని మండిపడ్డారు.. ఆస్తి పన్నులు కట్టకపోతే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారని, ఎవరెబ్బ సొమ్మని స్వాదీనం చేసుకుంటారని ప్రశ్నించారు. కరోనాతో వ్యాపారాలు లేక అల్లాడుతున్న వారిని బెదిరిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.. భవిఫ్యత్ లో పెరగబోయే ఇంటి పన్నులపై ప్రజలు, అన్ని పార్టీలతో కలిసి ఉద్యమాలు చేస్తామనిఆయన అన్నారు. పై కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జెన్నీ రామనహ్య,మాజీ కార్పొరేటర్ వచ్చి భువనేశ్వర్ ప్రసాద్ ,కొండ ప్రవీణ్ ,సురేష్, ఆకుల హనుమంతరావు, పసుపులేటి మల్లికార్జున, సృజన్ నాగేంద్ర, ప్రవీణ్, సుఖేష్ వర్ధన్ రెడ్డి నాగార్జున తదితరులు పాల్గొన్నారు
నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రక్రియలో లోపాలు సిపిఎం వార్డు పునర్విభజనకు తయారుచేసిన డీలిమిటేషన్ మెటీరియల్ గతంలో ఏదైతే హైకోర్టు తప్పులు గా ఉందని కొట్టివేసింది ఆ పేర్లు అక్షరాల పొల్లుపోకుండా గీత మార్చకుండా తేదీ మార్చి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల అలసత్వం వల్ల ఓటర్ల లిస్టు లో తప్పులు జరిగాయని ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు డోర్ డోర్ వెరిఫికేషన్ చేసి కొత్త జాబితాను ముద్రించాలని