కొండ బిట్రగుంట లో జరుగుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఆలయానికి వచ్చిన
నెల్లూరు నగరంలోని
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ (రెవెన్యూ ) హరేంధిర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) డా.ఎన్.ప్రభాకర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ ( ఆసరా) టి.బాపిరెడ్డి, మున్సిపల్ కమీషనర్ దినేష్ కుమార్, గూడూరు సబ్ కలెక్టర్ శ్రీ ఆర్.గోపాల కృష్ణ, డి.ఎఫ్.ఓ షణ్ముక్ కుమార్, డి.ఆర్.ఓ ఓబులేశు, కలెక్టరేట్ ఎ.ఓ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు
తదనంతరం, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారు మాట్లాడుతూ...
👉 సినీ రంగ రారాజు గా వెలుగొందుతున్న నందమూరి తారక రామారావు గారు ప్రజా జీవితం లోకి అడుగు పెట్టి నేటితో 4 దశాబ్దాలు పూర్తి అయ్యాయి.
👉 తెలుగు ప్రజల కష్టాలను,ఎదుర్కొంటున్న సమస్యల్ని చూసి చలించిపోయి, వారిని ఆదుకోవాలనే లక్ష్యం తో 39 ఏళ్ల క్రితం ఎన్.టి.ఆర్. గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు.
👉 సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం తో , తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతూ ఆవిర్భవించినదే తెలుగుదేశం పార్టీ.
👉 ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ వంటి కనీస అవసరాలు అందాలన్నదే తెలుగుదేశం పార్టీ ఆశయం.
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
👉 పేద,బడుగు, బలహీన వర్గ ప్రజలకు చట్ట సభల్లో చోటు కల్పిస్తూ , యువతరాన్ని ప్రోత్సహిస్తూ వారికి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ.
👉 నిమ్న జాతుల రిజర్వేషన్ల అమలు కోసం అంబేడ్కర్ గారు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన జ్యోతి రావ్ పూలే, జగ్జీవన్ రావు వంటి చరిత్ర కారుల పక్కన ఎన్.టి.ఆర్ గారు చోటు దక్కించుకున్నారు.
👉 స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు , బలహీన వర్గాలకు రాజకీయాల్లో చోటు మరియు ప్రభుత్వాలలో భాగస్వామ్యం పొందుతున్నారంటే అందుకు ఎన్.టి.ఆర్. గారి ప్రోత్సాహమే కారణం.
👉 క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, సుశిక్షితులైన నాయకులు తెలుగుదేశం పార్టీ సొంతం.
ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ
👉 రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోని తెలుగుదేశం పార్టీ తీవ్ర కృషి చేస్తోంది.
👉 దేశం లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దే.
👉 దేశ వ్యాప్తంగా ఎన్ని పార్టీ లు ఉన్నా కార్యకర్తలకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమం కోసం పాటు పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నే.
👉 ఎన్ టి ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా , పేద, బడుగు, బలహీన వర్గ ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం లో తెలుగుదేశం పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ నాయకులు, జిల్లా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..
-------------------------------------------------------------------
🔹 తిరుపతి పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ నిమిత్తం నెల్లూరుకు విచ్చేసిన రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి కొడాలి నాని, రాష్ట్ర రవాణా, సమాచారశాఖా మంత్రి పేర్ని నాని లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లి తేనీరు సేవించారు.
🔹 ఇద్దరు మంత్రులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులతో యోగక్షేమాలు విచారించారు.
అట్టహాసంగా నామినేషన్
వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి నామినేషన్ కార్యక్రమం నెల్లూరులో సోమవారం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి కీలక రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆదాల ప్రభాకర్ రెడ్డి (నెల్లూరు) వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి (రాజ్యసభ) తరలివచ్చారు. జిల్లా వైసిపి కార్యాలయానికి తరలివచ్చిన వీరంతా ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి కి జిల్లా వైసీపీ అధ్యక్షులు కాకాణి పూలమాలతో స్వాగతించారు. అనంతరం వి ఆర్ సి కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాల్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి , కన్నబాబు, ఆళ్ల నాని, పేర్ని నాని, ఆదిమూలపు సురేష్, జిల్లా మంత్రులు అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ రెడ్డి పాల్గొన్నారు. టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి, నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లు హాజరయ్యారు. వీరితో పాటు జిల్లా ఎమ్మెల్యేలు రామ్ నారాయణ రెడ్డి, (వెంకటగిరి) కిలివేటి సంజీవయ్య, (సూళ్లూరుపేట) వరప్రసాదరావు (గూడూరు) కాకాణి గోవర్ధన్ రెడ్డి (సర్వేపల్లి), ప్రసన్నకుమార్ రెడ్డి (కోవూరు) కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ( నెల్లూరు రూరల్), రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి (కావలి), మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి (ఉదయగిరి) హాజరయ్యారు. అలాగే విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, మాజీ కార్పొరేటర్ స్వర్ణ వెంకయ్య, పాముల హరి, శ్రీకాంత్ రెడ్డి, మల్లు సుధాకర్ రెడ్డి, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.ఆనంతరం విఆర్సీ నుంచి కలక్టరేట్ వరకు భారీ ర్యాలీ జరిగింది. అభిమానులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.