తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవాన్నిఅబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జెండా ను ఆవిష్కరించారు...
తెలుగుదేశం పార్టీ 40 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని, నెల్లూరు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు
అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో తెలుగుదేశం పార్టీ జెండా ను ఆవిష్కరించారు...
తదనంతరం, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి గారి అధ్యక్షతన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులను శాలువా కప్పి సన్మానించారు.
ఈ సందర్భంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర గారు మాట్లాడుతూ...
👉 సినీ రంగ రారాజు గా వెలుగొందుతున్న నందమూరి తారక రామారావు గారు ప్రజా జీవితం లోకి అడుగు పెట్టి నేటితో 4 దశాబ్దాలు పూర్తి అయ్యాయి.
👉 తెలుగు ప్రజల కష్టాలను,ఎదుర్కొంటున్న సమస్యల్ని చూసి చలించిపోయి, వారిని ఆదుకోవాలనే లక్ష్యం తో 39 ఏళ్ల క్రితం ఎన్.టి.ఆర్. గారు తెలుగుదేశం పార్టీ స్థాపించారు.
👉 సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్న నినాదం తో , తెలుగు వాడి ఆత్మ గౌరవాన్ని చాటి చెబుతూ ఆవిర్భవించినదే తెలుగుదేశం పార్టీ.
👉 ప్రతి ఒక్కరికి కూడు, గూడు, గుడ్డ వంటి కనీస అవసరాలు అందాలన్నదే తెలుగుదేశం పార్టీ ఆశయం.
ఈ సందర్భంగా నెల్లూరు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ...
👉 పేద,బడుగు, బలహీన వర్గ ప్రజలకు చట్ట సభల్లో చోటు కల్పిస్తూ , యువతరాన్ని ప్రోత్సహిస్తూ వారికి పెద్ద పీట వేసింది తెలుగుదేశం పార్టీ.
👉 నిమ్న జాతుల రిజర్వేషన్ల అమలు కోసం అంబేడ్కర్ గారు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటు పడిన జ్యోతి రావ్ పూలే, జగ్జీవన్ రావు వంటి చరిత్ర కారుల పక్కన ఎన్.టి.ఆర్ గారు చోటు దక్కించుకున్నారు.
👉 స్థానిక సంస్థలలో రిజర్వేషన్లు , బలహీన వర్గాలకు రాజకీయాల్లో చోటు మరియు ప్రభుత్వాలలో భాగస్వామ్యం పొందుతున్నారంటే అందుకు ఎన్.టి.ఆర్. గారి ప్రోత్సాహమే కారణం.
👉 క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలు, సుశిక్షితులైన నాయకులు తెలుగుదేశం పార్టీ సొంతం.
ఈ సందర్భంగా నగర నియోజకవర్గ ఇంఛార్జి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారు మాట్లాడుతూ
👉 రాష్ట్ర ప్రగతి, ప్రజా సంక్షేమం కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం లోని తెలుగుదేశం పార్టీ తీవ్ర కృషి చేస్తోంది.
👉 దేశం లో ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ను ఏర్పాటు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ దే.
👉 దేశ వ్యాప్తంగా ఎన్ని పార్టీ లు ఉన్నా కార్యకర్తలకు అండగా నిలుస్తూ, వారి సంక్షేమం కోసం పాటు పడిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ నే.
👉 ఎన్ టి ఆర్ గారి ఆశయాల సాధనే లక్ష్యంగా , పేద, బడుగు, బలహీన వర్గ ప్రజల సంక్షేమం, అభ్యున్నతి కోసం నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వం లో తెలుగుదేశం పార్టీ అహర్నిశలు శ్రమిస్తోంది.
ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా లోని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గ నాయకులు, జిల్లా నాయకులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..