నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఆటోనగరులో దాదాపు 8కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు,డ్రైన్లు,కల్వర్టులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి..
ఈ 8కోట్ల రూపాయలతో దాదాపు ఆటోనగర్ సగం భాగం మాత్రమే పూర్తి అయ్యే అవకాశం ఉందని,
మొత్తం పూర్తి కావాలంటే మరో 12కోట్ల రూపాయలు అవసరం ఉంది..
ఆ నిధులను కూడా వీలైనంత త్వరగా తీసుకుని వచ్చి పూర్తి స్థాయిలో ఆటోనగరుని అభివృద్ధి చేస్తాం....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
ఈ ఆటోనగరులో రోడ్లు,డ్రైన్లు,కల్వర్టులు సమస్య ఉందని చెప్పిన వెంటనే వేగవంతంగా స్పందించిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారికి ప్రత్యేకంగా రూరల్ నియోజకవర్గ మరియు ఆటోనగర్ వాసుల పక్షాన కృతజ్ఞతలు తెలుపుతున్నా....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు జిల్లాలో రేషన్ సరుకుల డెలివరీకి సంబంధించి జిల్లాకు చేరుకున్న ప్రత్యేక వాహనాల రిజిస్ట్రేషన్ త్వరితగతిన పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలని
సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నెల్లూరు జిల్లా రాపూరులోని స్మశానవాటిక వద్ద తమ కుటుంబ సభ్యులకు సమాధులు వద్ద పెద్దల పండుగను ఘనంగా జరుపుకున్నారు.సమాధులకు సున్నాలు,పెంయిట్స్ వేసి తాము చేసిన పిండి వంటలను ,తమ పెద్ద లకు ఇష్టమైన వాటిని నైవేధ్యంగా సమర్పించి,నివాళులర్పించారు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు,వ్యాపారాలు చేస్తూ ఉన్నవారు కూడా ఈ పండుగకు ఇక్కడికి వచ్చి పెద్దలను స్మరించుకుని పండుగను జరుపుకోవడం ఆనవాయితీ...చిన్న,పెద్దలు సమాధులు వద్దకు చేరు
సెటిల్ బ్యాట్మెంటన్ పోటీలను ప్రారంభించిన ఎస్ ఐ ఏ బాజిరెడ్డి.
- క్రీడలను ప్రోత్సహించేవారు లేకపోతే ఆ గ్రామాలలో క్రీడలు కనుమరుగవుతాయి అని క్రీడలను ప్రోత్సహించేవారు ఉంటే ఆ గ్రామాలలో క్రీడాకారులు వందల సంఖ్యలో వెలుగులోకి వస్తారని నెల్లూరు జిల్లా వింజమూరు మండలం ఎస్సై బాజిరెడ్డి అన్నారు సంక్రాంతి పండగను పురస్కరించుకొని వింజమూరు లో గల అగ్నిమాపక కేంద్రం ప్రాంగణంలో ఎస్ఐ బాజిరెడ్డి వైసీపీ కన్వీనర్ గువ్వల కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని సెటిల్ బ్యాట్మెంటన్ క్రీడల పోటీలను ప్రారంభించారు.
వాయిస్ :- ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల వైపు ఆసక్తి కలిగించేలా యువతను ప్రోత్సహిస్తూ ప్రతి సంవత్సరం ఆటల పోటీలను నిర్వహించడం చాలా సంతోషకరం అని క్రీడల నిర్వహణకు సహాయ సహకారాలు అందిస్తున్న ప్రజా ప్రతినిధులకు నా కృతజ్ఞతలు అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ యువ నాయకులు జూపల్లి రాజారావు మద్దూరి లక్ష్మీ ప్రసన్న రెడ్డి గోవిందరెడ్డి అన్నపు రెడ్డి శ్రీనివాసరెడ్డి రాజారెడ్డి పోలీస్ సిబ్బంది అగ్నిమాపక సిబ్బంది స్థానిక యువకులు పాల్గొన్నారు.
నెల్లూరులో ఘనంగా పెద్దల పండుగ..
సంక్రాంతి ని పురస్కరించుకొని నెల్లూరు జిల్లా ప్రజలు బోడి గాడి తోటలోని సమాధుల వద్ద తమ పూర్వీకులను స్మరించుకుంటూ పూజలు నిర్వహించారు చాలా కుటుంబాల్లో కాలంచేసిన కుటుంబీకులను స్మరించుకోవడం ఆనవాయితీగా వస్తోంది మరణించినవారికి ఇష్టమైన వంటకాలను వారి సమాధులకు సమర్పిస్తారు. ఈ సంవత్సరం కూడా ఇలానే గతించిన కుటుంబ సభ్యులను స్మరించుకునేందుకు బోడిగాడితోటకు జనం భారీగా తరలివచ్చారు.