నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో
🔹 పేషేంట్లను తాకాలంటేనే భయపడుతున్న సమయంలో నెల్లూరు జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో షుమారు 150మంది డెంటల్ డాక్టర్లు,ఆయుష్ డాక్టర్లు అందించిన సేవలను అభినందిస్తున్నా.....రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.
🔹 ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రం మొత్తం 70వేలు జీతం రావాల్సి ఉండగా, గౌరవ ముఖ్యమంత్రివర్యులు స్పందించి, కోవిడ్ సమయంలో విధులు నిర్వర్తించిన ఆయా డాక్టర్లకు జీతాలు అందించటానికి ఏర్పాట్లు చేయటం జరిగింది. నెల్లూరు ప్రభుత్య ప్రధాన వైద్యశాలలో 50వేలు జీతం మాత్రమే చెలిస్తామంటున్నారని డాక్టర్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కలసి ఆవేదన వ్యక్తం చేసారు. స్పందించిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్కడినుంచే జిల్లా కలెక్టర్ గారితో ఫోన్లో మాట్లాడి 70వేల జీతం వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ కి ఆదేశాలు ఇవ్వాలని కలెక్టర్ గారిని కోరారు.
ఆత్మీయ పలకరింపులు, ఆప్తులను కోల్పోయిన వారికి పరామర్శలతో పొదలకూరు, బిరదవోలు, మొగళ్లూరు, అమ్మవారిపాళెం, నావూరుపల్లి, నావూరు, తాటిపర్తి, యర్రబల్లిలో సాగిన పర్యటన
సోమిరెడ్డి కామెంట్స్
మీరు పుట్టిన, మీకు పదవులిచ్చిన పొదలకూరు ప్రాంతాన్ని 30 ఏళ్లుగా బీడు పెట్టుకుంటే మేం వచ్చి అభివృద్ధి చేసి ఒక రూపు తెచ్చాం..
కాంగ్రెస్, వైసీపీకి మెజార్టీ ఇస్తున్న ప్రజలు కూడా ఒక్క సారి మంచి మనస్సుతో ఆలోచించాలి..పొదలకూరు మండల అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందో గుర్తించాలి..
రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పాటు ఏడీబీ, ప్రపంచ బ్యాంకు, నాబార్డు నిధులు కోట్లకు కోట్లు తెచ్చి పల్లెలకు రోడ్లు వేయించాం..చెరువుల పనులు చేయించాం..చెక్ డ్యాంలు నిర్మించాం..
పి.హెచ్.సీ స్థాయిని పెంచి రూ.4 కోట్లతో సకల వసతులు కలిగిన 30 బెడ్ల ఆస్పత్రి కట్టాం..అత్యాధునిక కంటి వైద్య విభాగాన్ని పేదలకు అందుబాటులోకి తెచ్చాం..
30 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న దక్షిణ కాలువ పనులను రూ.7 కోట్లతో చేపట్టి పొదలకూరు మండలానికి సోమశిల జలాలు తెచ్చాం..కొనసాగుతున్న పనులను ఈ ప్రభుత్వం వచ్చాక నిలిపేశారు..
పెద్ద మండలమైన పొదలకూరులో ప్రారంభించిన మినరల్ వాటర్ ప్లాంటును మూలన పెట్టేశారు..
తోడేరు పెద్దరెడ్లు మాత్రమే తాగాల్సిన మినరల్ వాటర్ పేదోళ్లు, సామాన్యులు కూడా తాగుతారా...అని కోపమొచ్చినట్టుంది..
తాగునీరు కలుషితమై కలువాయి మండలం వెరుబొట్లపల్లిలో బెంగాల్ కూలీలు 50 మంది ఆస్పత్రి పాలై ఒకరు చనిపోవడం..ఏలూరులో వందల మంది ఆస్పత్రుల పాలవడం చూశాం..
పొదలకూరు మండల ప్రజలు మంచి నీళ్లు తాగాలని ప్రభుత్వమే నిర్వహించే మినరల్ వాటర్ ప్లాంటును అప్పటి మంత్రి లోకేష్ బాబును ఒప్పించి తెస్తే ఆపడానికి మనస్సు ఎలా వచ్చిందయ్యా..
అన్న క్యాంటీన్ మూసేసి పేదల నోటి కాడి కూడు తీసేశారు..
కండలేరు ఎడమ కాలువ కూడా ఎన్టీఆర్ పుణ్యమే..దానికి లిఫ్ట్ కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మేం తెచ్చాం..
రూ.62 కోట్లతో తెచ్చిన లిఫ్ట్ తో రైతులు ఎప్పుడు కోరితే అప్పుడు నీళ్లిచ్చాం..
రైతులు తరుముతారని గమ్ముగున్నారు కానీ లేదంటే లిఫ్ట్ ను కూడా నిలిపేసుండేవాళ్లు...
జరుగుతున్న పనులను నిలిపేయడం తప్ప..మీరు చేసిందేమిటి..
జిల్లాకు ఒక మండలానికి రూర్బన్ లో అవకాశం వస్తే ..వెంకయ్య నాయుడు గారి పుట్టిల్లు వెంకటాచలంకు తెచ్చి కోట్లాది రూపాయలతో పనులు చేశాం..
ఈ రోజు మీరు ఆర్భాటంగా రూర్బన్ పథకానికి భారీ శిలాఫలకం వేసుకున్నారు..సంతోషం
రాష్ట్రమంతా అమలవుతున్న రొటీన్ పథకాలు తప్ప ప్రత్యేకంగా సర్వేపల్లి నియోజకవర్గానికి ఏం సాధించారో ప్రజలకు చెప్పి పార్లమెంటు ఉప ఎన్నికల్లో ఓట్లు అడగండి..
టీడీపీ ప్రభుత్వంలో మంజూరైన రోడ్లకు బిల్లులిస్తున్నాం అంటున్నారు..మీరు ఇస్తున్నది మీ సొంత డబ్బులేం కాదు..అవన్నీ ఏడీబీ, ప్రపంచ బ్యాంకు గ్రాంట్లు..
కొత్త పథకం ఏం తెద్దాం అని ఆలోచన ఉండాలి కానీ మినరల్ వాటర్ స్కీం ఆపేస్తాం..దక్షిణ కాలువ పనులు ఆపేస్తాం..అన్న క్యాంటీన్ ఆపేస్తామనడం తగదు..
పైన దేవుడు అన్నీ చూస్తున్నాడు..ప్రజలు ఇప్పటికైనా ఆలోచిస్తారని మాకు నమ్మకం ఉంది..
నెల్లూరు జిల్లా, సర్వేపల్లి నియోజకవర్గం,
రైతులకు 80 శాతం సబ్సీడీతో విత్తనాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాకాణి.
పొదలకూరు పట్టణంలో పావని షాపింగ్ ఆర్కేడ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కాకాణి.
స్క్రోలింగ్ పాయింట్స్:
👉పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి ఇళ్లు కట్టించి ఇవ్వాలనే లక్ష్యంతో డిసెంబర్ 25వ తేదీ నుండి జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు.
👉జగన్మోహన్ రెడ్డి గారు అర్హులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు పూర్తి హక్కులు కలిగే విధంగా ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
👉పేదవాళ్లకు ఇచ్చే జానెడు జాగాకు సర్వహక్కులు కల్పించడం వల్ల తెలుగుదేశం వాళ్లకు వచ్చిన ఇబ్బందులు ఏమిటో తెలియడం లేదు!.
👉చంద్రబాబు, తెలుగుదేశం వాళ్ళు పేదలకు ఇచ్చే ఇళ్ళ స్థలాలను కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు.
👉పేదలు బాగుపడుతుంటే తెలుగుదేశం వాళ్లు తట్టుకోలేక, బాధపడుతున్నారు.
👉 ఎవరు అడ్డుకోవాలని చూసినా పేదలకు డిసెంబర్ 25వ తేదీన ఇళ్ళ స్థలాల పంపిణీ చేపడుతాం.
👉 తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన సోమిరెడ్డి అవినీతి పుణ్యమా అని సాగునీటిని తరలించే లిఫ్ట్ వైఫల్యం చెందింది.
👉తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఎంత పంట పండించారో చెప్పే ధైర్యం ఉందా!
👉వైయస్సార్ ప్రభుత్వంలో సాగునీటికి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో సాగు నీటిని పంపిణీ చేయడంతో, రైతులు పంటలు పండిస్తున్నారు.
👉 సర్వేపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రతి ఇంటికి తాగు నీరు అందించే జల జీవన్ మిషన్ పథకానికి 30 కోట్లతో శ్రీకారం చుట్టి మంత్రులచే శంఖుస్థాపన చేయించడం జరిగింది.
👉మంత్రిగా సోమిరెడ్డి తాగు నీటి కోసం ఏవేవో ఏర్పాటు చేస్తానని మభ్య పెట్టడం తప్ప, ఏ ఒక్కటి చేయని పరిస్థితి.
👉మంత్రిగా పెత్తనం వెలగబెట్టినా, అవినీతి సంపాదన పై ధ్యాస తప్ప, సోమశిల దక్షిణ కాలువకు కనీసం అటవీశాఖ అనుమతులు తీసుకొని రాలేని పరిస్థితి.
👉 గ్రామాల్లో అభివృద్ధి జరగకుండా, విచ్చలవిడిగా అవినీతికి పాల్పడిన పరిస్థితి.
👉తెలుగుదేశం ప్రభుత్వంలో రూ-అర్బన్ పధకం క్రింద కోట్లాది రూపాయలు దోచుకోవడం తప్ప, అభివృద్ధి జరగలేదు.
👉రూ-అర్బన్ పధకం కింద గతంలో మాదిరిగా కాకుండా, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ, పూర్తి స్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టాం.
👉తెలుగుదేశం నాయకులు పేదల ఇళ్ల స్థలాలు అడ్డుకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు.
👉సర్వేపల్లి నియోజకవర్గంలో ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా, అన్ని వర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడమే ధ్యేయంగా పని చేస్తున్నాం.
👉తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాల ఆదుకుంటున్నారు.
👉గతంలో మంత్రులుగా పనిచేసినవారు మిల్లర్ల దగ్గర ముడుపులు మింగి, నీరు-చెట్టు, రైతు రధం పేరిట రైతులను అడ్డుపెట్టుకొని అన్ని విధాలా దోచుకున్నారు.
👉గతంలో వ్యవసాయ శాఖ మంత్రి గా ఉన్న వ్యక్తి రైతులకు ఏమి ఒరగబెట్టాడో చెప్పే ధైర్యం ఉందా!
👉మా ప్రభుత్వం రైతులకు అన్ని విధాలా అండగా ఉంటూ, చేయూతనివ్వడం జరుగుతుంది.
👉చంద్రబాబు రైతుల గురించి ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు.
👉గత చంద్రబాబు ప్రభుత్వంలో రైతులకు ఇవ్వని ఇన్ ఫుట్ సబ్సిడీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు.
👉రైతాంగానికి సంబంధించి అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుంది.
MBBS సీటు సాధించిన గిరిజన బాలికకు ఆర్దిక సాయం అందజేత
✍️ నెల్లూరు నగరంలోని కొండాదిబ్బ ప్రాంతానికి చెందిన ఉప్పల ప్రవళిక MBBS సీటు సాధించారు.
✍️ తల్లిదండ్రులు ఇద్దరూ పారిశుద్ద కార్మికులు. ఫీజు కట్టేందుకు స్థోమత లేని విషయాన్ని తెలుసుకుని ఈ రోజు యానాదుల సాధికారిత సంఘం, యానాదుల(గిరిజన) సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో లక్ష రూపాయలు ఆర్ధిక సాయం చేయడమైనది.
✍️ ఈ కార్యక్రమంలో పూర్వపు ITDA po యాకసిరి వెంకటేశ్వర్లు, ఇరిగేషన్ DEE తలపల రమేష్,(విజయవాడ) గిరిజన సంఘాల నాయకులు కెసి పెంచలయ్య, గంధళ్ల శ్రీరాములు, బాపట్ల నాగేశ్వరరావు, చేవూరు సుబ్బారావు, శ్రీమంతుల మురళీ, రిటైర్డ్ MRO ముత్యం నరసింహులు, BL శేఖర్, రాపూరు కృష్ణయ్య, కోట్లపాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
నెల్లూరు మూలపేట కొండదిబ్బ ప్రాంతంలో నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి చదువుల తల్లి సరస్వతీ దేవి వడిలో పెరిగిన యూ. ప్రవలళ్లిక చదువులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి తిరుపతి పద్మావతీ వైద్యకళాశాలలో మెడిసిన్ సాధించి (MBBS)కాలేజీలో చేరడానికి హాస్టల్ ఫీజులుకు ఖర్చులకు డబ్బులు లేవని తనని ఆర్థికంగా ఆదుకోవాలని పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి ఒక్క చిన్న విన్నపము రాసుకోగా ఉదార హృదయంతో వెంటనే స్పందించి 40,000రూపాయలను ప్రవాళ్ళిక కు అందచేసిన మరోసారి తన దాతృత్వ హృదయానికి హద్దులు లేవని, సేవా కార్యక్రమాలుకు ప్రాంతాలు అడ్డురావని సేవా కార్యక్రమాలుకు అలుపులేదని నిరూపించుకున్నారని ప్రవళ్ళిక తో పాటు తన తల్లిదండ్రులు పెర్నాటి చారిటబుల్ ట్రస్ట్ కు పెర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
ఎప్పటి నుంచో జపాన్ తో ఆంధ్రప్రదేశ్ కు మంచి అనుబంధం
విశాఖపట్నంలో 10 లక్షల చదరపు అడుగుల్లో 'జపనీస్ ఎన్‌క్లేవ్' నిర్మాణం
చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా 'జపాన్ డెస్క్ ఏర్పాటు'
ఇప్పటికే ఏపీలో కొలువైన ఏటీసీ టైర్స్, యొకొహొమా గ్రూప్ వంటి ప్రఖ్యాత పరిశ్రమలు
ఒక్క వాహనాల టైర్ల తయారీలోనే 2000 మందికి ఉపాధి, యువతకు శిక్షణ అందించేందుకు శిక్షణ కేంద్రం ఏర్పాటు
శ్రీసిటీలో భారీ స్థాయిలో ఏర్పాటైన జపాన్ ఇండస్ట్రియల్ టౌన్ షిప్
వైజాగ్ - చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC)అభివృద్ధిలో భాగంగా మరో జపాన్ పారిశ్రామిక టౌన్ షిప్ కు ప్రతిపాదన
తొలిసారిగా తీర ప్రాంత కారిడార్ గా ఈస్ట్ కోస్ట్ ఎకనమిక్ కారిడార్ (ECEC)
శ్రీసిటీ పరిసరాల్లో 150 నుంచి 200 జపనీయులు ఉన్నారు
చిత్తూరులో జపాన్ ఇండస్ట్రియల్ టౌన్‌షిప్
విశాఖలో పదిలక్షల చదరపు అడుగుల్లో జపనీస్ ఎన్‌క్లేవ్ నిర్మాణం
చైనా నుంచి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే జపాన్ కంపెనీలకు ప్రత్యేక రాయితీలు
పెట్టుబడుల ఆకర్షణకు ప్రత్యేకంగా జపాన్ డెస్క్ ఏర్పాటు
ఇప్పటికే రాష్ట్రంలో 25కిపైగా జపాన్ కంపెనీల పెట్టుబడులు
మరిన్ని రంగాలలో జపాన్ పరిశ్రమల నుంచి పెట్టుబడులు ఆకర్షణ కోసం జపాన్-ఇండియా తయారీ సంస్థ(JIM-JAPAN-INDIA INSTITUTE FOR MANFACTURING) ఏర్పాటు
కోల్‌కతా నుంచి కన్యాకుమారి వరకు వున్న 2,500 కి.మీ తూర్పు తీర ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్‌ను మూడు దశల్లో అభివృద్ది చేయాలని కేంద్రం నిర్ణయం. అందులో భాగంగా తొలి దశలో విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి.
జపాన్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజన్సీ నేతృత్వంలో కృష్ణపట్నం కేంద్రంగా నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్ మెంట్ , ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (NICDIT) భాగస్వామ్యం ద్వారా చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్(CBIC) అభివృద్ధికి 1300 కోట్ల నిధులు
ప్రధాని మోదీ, కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ నేతృత్వంలో పరిశ్రమలను ఆదుకోవడం కోసం కోవిడ్-19 సమయంలో ఆత్మనిర్భర్ సహా పలు కీలక సంస్కరణలు
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిలో జపాన్ పాత్ర ఎంతో కీలకం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో జపాన్ కు బలమైన సంబంధాలు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని ఏడాదిన్నర ప్రభుత్వంతో మరింత అనుబంధం
డీపీఐఐటీ, సీఐఐ ఆధ్వర్యంలో జరిగిన భాగస్వామ్య సదస్సు-2020లో పాల్గొన్న పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
విజయవాడ ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలోని సమావేశ మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జపాన్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి మేకపాటి సమావేశం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన జపాన్ భాగస్వామ్య సదస్సుకు హాజరైన కేంద్ర డీపీఐఐటీ శాఖ కార్యదర్శి గురుప్రసాద్ మోహపాతర, రాష్ట్ర పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ వైస్ ఛైర్మన్ రవీన్, ఈడీ ప్రతాప్ రెడ్డి, జపాన్ కు చెందిన ఎకనమీ, ట్రేడ్, పరిశ్రమల శాఖ (METI) వైస్ మంత్రి సన్ షిగెహిరో టనక, జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (JETRO) సీఐఐ వైస్ ఛైర్మన్ విక్రమ్ కిర్లోస్కర్ , జపాన్ భారత అంబాసిడర్ సంజయ్ కె వర్మ, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు, ఇతరులు...
ప్రతి జిల్లాలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధి : పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి
పరిశ్రమల శాఖపై మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష
పోర్టులు,రాబోయే ప్రాజెక్టులకు ఏపీఐఐసీ భూముల కేటాయింపులు, 'ఒక జిల్లా-ఒక వస్తువు'పై చర్చ
అమరావతి, డిసెంబర్, 17; రాష్ట్రవ్యాప్తంగా ప్రతి జిల్లాలో ఎమ్ఎస్ఎమ్ఈ పార్కుల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. పరిశ్రమల శాఖపై విజయవాడలోని ఏపీఎస్ఎఫ్ఎల్ కార్యాలయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఏపీఐఐసీ భూ కేటాయింపులు, ఒక జిల్లా-ఒక వస్తువు, పోర్టుల నిర్మాణానికి సంబంధించిన ప్రస్తుత పరిస్థితి, రాబోయే ప్రాజెక్టులకు ఏపీఐఐసీ ద్వారా కేటాయించవలసిన భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా మంత్రి మేకపాటి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో చర్చించారు. ఈ సమీక్షలో పరిశ్రమల శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి కరికాల వలవన్, ఏపీఐఐసీ ఎండీ రవీన్ రెడ్డి, ఈడీ ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.