కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలి.... *సిపిఎం*
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను విడనాడాలి.... *సిపిఎం*
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ సిపిఎం నగర కార్యదర్శి మూలం రమేష్ ముఖ్యఅతిథిగా పాల్గొని పాదయాత్రలు నిర్వహించారు.శుక్రవారం నగరంలోని 11డివిజన్ ఎన్టీఆర్ నగర్,రింగ్ రోడ్డు,రాయపుపాలెం,సరస్వతి నగర్,పాదయాత్రలు నిర్వహించారు.ఈ సందర్భంగా మూలం రమేష్ మాట్లాడుతూ కరోనాతో ప్రపంచ దేశాలు అతలాకుతలం అవుతున్న నేపథ్యంలో ప్రజలు ఉపాధి లేక కష్టాలను ఎదుర్కొంటున్నా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను ఆదుకునే చర్యలు చేపట్టకుండా ప్రజలపై భారాలు మోపుతోందన్నారు.ఆర్థిక వ్యవస్థను కార్పొరేటర్ల పరం చేసి చట్టాలను ఆమోదింప చేసుకోవడంతో ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు.అనంతరం ఇంటింటికి తిరిగి ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో డివిజన్ కార్యదర్శి పి సూర్యనారాయణ, ఐద్వా జిల్లా కార్యదర్శి టి శివకుమారి, సభ్యులు ఆవుల పెంచాలయ్య,కెవి సుబ్బారావు పసుపులేటి మల్లికార్జున,రవి,గోతం మురళి,బట్టేపాటి వెంకటేశ్వర్లు,,కర్తం బాబు,కె సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.