ఎన్ని కష్టాలొచ్చినా పోలవరం కట్టి తీరుతాం..*
*మంగళగిరిలో లోకేష్ కు గోచీ కూడా ఊడ తీశారు*
*మంత్రి అనిల్ కుమార్ యాదవ్* *పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఎన్ని కష్టాలొచ్చినా కట్టి తీరుతామని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.నెల్లూరు నగరంలోని వైసిపి జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరానికి సంబంధించి ద్రోహం చేసింది టిడిపి అని ధ్వజమెత్తారు.. 2007లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అప్పుడు క్యాబినెట్లో చేసిన తీర్మానాల వల్లే పోలవరంకు నేడు ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి సరైన గుణపాఠం జరిగిందని మంగళగిరి ఎన్నికల్లో లోకేష్ పప్పు మహారాజ్ కు అక్కడ ప్రజలు గోచి కూడా లాగేసారన్నారు..చీకట్లో కాళ్లు పట్టుకునే సంస్కృతి టిడిపిదని అది తమకు చేత కాదన్నారు... ఎన్ని సమస్యలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా ధైర్యంగా ఎదుర్కొనే దమ్ము తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్నాయని పేర్కొన్నారు... తనను నోటి పారుదల శాఖ మంత్రిగా టిడిపి నేతలు విమర్శిస్తుంటారని అది నిజమేనన్నారు. పప్పు మహారాజ్ ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్నారు*
స్థానిక సంస్థల ఎన్నికలపై క్లారిటీ ఇచ్చిన మంత్రి అనిల్
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారంపై చర్చ హాట్‌హాట్‌గా సాగుతోంది... అయితే, స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పుడు నిర్వహించడం కుదరదని అని స్పష్టం చేశారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్.. విజయవాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా కారణంగా ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదన్నారు.. ఇంకా, రాష్ట్రంలో కరోనావైరస్ నియంత్రణలోకి రాలేదని తెలిపారు.. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ విషయమై ప్రభుత్వంతో ఎన్నికల సంఘం చర్చించాలని సూచించిన మంత్రి అనిల్.. ఎన్నికల కమిషన్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోడం కుదరదు అన్నారు.. ఎన్నికల కమిషన్, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లినప్పుడే నిర్ణయం తీసుకునేందుకు వీలవుతుందన్నారు... అంతేకాదు.. చంద్రబాబు చెప్పినట్టుగా ఇక్కడ ఏమీ జరగదు అన్నారు మంత్రి అనిల్. కాగా, స్థానిక సంస్థల ఎన్నికలపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే..