మనం- మన పరిశుభ్రత రెండో విడత కార్యక్రమంలో భాగంగా జిల్లా పంచాయతీ అధికారి ఎం. ధనలక్ష్మి పొదలకూరు మండలంలోని అల్తుతి గ్రామంలో శుక్రవారం పర్యటించారు.. ఈ సందర్భంగా మనం...మన పరిశుభ్రత లక్ష్యాలను డిపిఓ వివరించారు అలాగే గ్రామంలో మొక్కలు నాటారు ..ఈ కార్యక్రమంలో పొదలకూరు ఎంపీడీవో నారాయణ, డీఎల్పీవో కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు
‘‘చాలా సమస్యలు మౌనంతో పరిష్కారం అవుతాయి. కానీ, మనం మాటలతో ఆ అవకాశాన్ని చేజార్చుకుంటాం ’’ అన్న మహాత్ముని సూక్తిని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మననం చేసుకున్నారు. నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం లాల్ బహదూర్ శాస్త్రి అని మంత్రి పేర్కొన్నారు. ఇద్దరు మహనీయులు ఒకే రోజున జన్మించడం , దేశం కోసం వాళ్లు చేసిన త్యాగాలు,సేవలను స్మరించుకోవడం భారతీయులుగా గర్వించదగినవని మంత్రి మేకపాటి ఆ మహనీయులను కొనియాడారు. ఎవరికీ సాధ్యం కాని అహింస మార్గంలో నడవడం వల్లనే గాంధీ 'మహాత్ముడి'గా అవతరించారన్నారు. 'జై జవాన్ జై కిసాన్' నినాదంతో లాల్ బహదూర్ శాస్త్రి గ్రీన్ రెవల్యూషన్ కి బాటలు వేశారని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, లాల్ బహదూర్ శాస్త్రి జైజవాన్ జై కిసాన్ నినాదాలకు ప్రతిరూపమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనగా మంత్రి మేకపాటి అభివర్ణించారు.
శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని గాంధీబొమ్మ సెంటర్ లో ఉన్న మహాత్ముడి విగ్రహానికి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సహా మంత్రి మేకపాటి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. నెల్లూరు జిల్లా కలెక్టర్ చక్రధర్ బాబు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, విజయ డైరీ ఛైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఇన్ ఛార్జ్ కోటం రెడ్డి గిరిధర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
దేశంలోనే ప్రత్యేక పరిపాలనా వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభమై ఏడాది పూర్తిచేసుకున్నందుకు సూచికగా శుక్రవారం రాత్రి 7 గంటలకు ప్రజలందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో సచివాలయ సిబ్బంది, వలంటీర్లను ప్రోత్సహించాలని నగర పాలక సంస్థ కమిషనర్ దినేష్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. సచివాలయ వ్యవస్థ ద్వారా పారదర్శక పాలన అందించడంతో పాటు కరోనా వ్యాధి నివారణలో అహర్నిశలు శ్రమిస్తున్న గ్రామ/వార్డు వలంటీర్లు, కార్యదర్శుల సేవలు అభినందనీయం అని కమిషనర్ ప్రకటించారు. సచివాలయం వ్యవస్థలోని వలంటీర్లు, కార్యదర్శుల సమన్వయంతో అర్హులైన లబ్ధిదారులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రణాళికాబద్ధంగా అందజేస్తున్నామని, సచివాలయ వార్షికోత్సవంలో ప్రజలంతా భాగస్వాములై శుక్రవారం రాత్రి 7 గంటలకు చప్పట్లతో ప్రోత్సాహం అందించాలని కమిషనర్ ఆకాంక్షించారు.
చిట్టమూరు: రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులు అమానుషం ఆని టీడీపీ మండల కన్వీనర్ గణపర్తి కిషోర్ నాయుడు అన్నాడు. శుక్రవారం మండల కేంద్రంలోని టిడిపి కార్యాలయం లో కిషోర్ నాయుడు అధ్యక్షతన జరిగిన టిడిపి మండల సమావేశంలో రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న పాశవిక దాడులను ఆయన ఖండించారు. ఈ సందర్భంగా ముందుగా మహాత్మా గాంధీ 151 వ జయంతి పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సమావేశంలో కిషోర్ నాయుడు మాట్లాడుతూ ఈ గాంధీ బ్రిటిష్ వాళ్ళతో పోరాడి శాంతి యుతం గా స్వాతంత్రం తీసుకు వచ్చాడని అలాంటిది ఇప్పుడు రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటినుండి బడుగు బలహీన వర్గాల పై దాడులు చేయించి వారిని భయభ్రాంతులకు గురిచేసి తమ గుప్పిట్లో ఉంచుకోవాలని రాక్షస ఆలోచనతో సీఎం జగన్మోహన్ రెడ్డి వారి అనుచరుల చేత ఈ దాడులు చేయిస్తున్నారని అందుకు నిదర్శనం దళిత డాక్టర్ సుధాకర్ పై జరిగిన దాడి మొదలు చిత్తూరు జిల్లాలో స్వయానా జడ్జి రామకృష్ణ తమ్ముడు రామచంద్ర పై పాశవికంగా నడిరోడ్డు పైన దాడి చేయించాడని అంతే కాకుండా మానవతా దృక్పథంతో సాటి కులస్థుడ్ని పరామర్శించడానికి వెళుతున్న గూడూరు మాజీ శాసనసభ్యులు పాశం సునీల్ కుమార్ ని గురువారం రాత్రి తమ ఇంటి వద్ద హౌస్ అరెస్ట్ చేయడం ఎంతవరకు న్యాయం అని ఆయన అన్నారు.
వైసిపి ప్రభుత్వ వ్యతిరేక పరిపాలన విధానాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు, మేధావులు గమనిస్తున్నారని ఇప్పటికైనా దాడులకు స్వస్తి పలికి పరిపాలన పై ముందుచూపుతో ప్రయాణించాలని అలా కాని పరిస్థితుల్లో త్వరలోనే వైసీపీ నాయకులు తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని కిషోర్ నాయుడు తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల ప్రధాన కార్యదర్శి చిన్నారావు, టిడిపి జడ్పిటిసి సభ్యులు మాలపాటి వెంకటకృష్ణ, బీసీ నాయకులు కస్తూరయ్య, మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు శ్రీనివాసులు రాజేష్ రెడ్డి పలువురు టిడిపి నాయకులు పాల్గొన్నారు.