గాంధీ జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలోని గాంధీ బొమ్మ సెంటర్ నందు గల మహాత్మా గాంధీ విగ్రహానికి ఐ.టి., పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గార్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, గాంధీ సేవలను కొనియాడి, ఆయన ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
2019లో రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో బ్లడ్ క్యాంప్ వెంకటగిరి పోలీస్ స్టేషన్ లో నిర్వహించినందుకు వెంకటగిరి ఎస్సై వెంకట్ రాజేష్ కు గురువారం నెల్లూరులో జిల్లా కలెక్టర్ చక్రధర బాబు చేతుల మీదగా మెమొంటో ను అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రక్తదానం చేసి ప్రాణాలు నిలుపుతున్న వారందరికీ ప్రతి ఒక్కరు రుణపడి ఉండాలని కొనియాడారు. రక్తదానం చేసిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు అనంతరం మెమొంటో ను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ నిర్వాహ కులు తదితరులు పాల్గొన్నారు.
తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యురాలి పదవికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత చంద్రబాబు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆమె ఈ పదవికి రాజీనామా చేసినట్లు సమాచారం. తొలుత కాంగ్రెస్‌లో ఉన్న గల్లా అరుణకుమారి.. వైఎస్, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి ప్రభుత్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2014 ఎన్నికలకు ముందు తెదేపాలో చేరిన ఆమె.. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమిపాలయ్యారు. అనంతరం 2018లో ఆమెను పొలిట్‌బ్యూరో సభ్యురాలిగా చంద్రబాబు నియమించారు. గల్లా అరుణకుమారి తనయుడు జయదేవ్ 2014, 2019 ఎన్నికల్లో గుంటూరు లోక్‌సభ నుంచి విజయం సాధించారు.
ఏపీలో టీడీపీకి మరో షాక్ తగలబోతోందా? మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరుతున్నారు.. అనే చర్చ ఊపందుకుంది. మాజీ మంత్రి, టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు తెలుగుదేశం పార్టీని వీడే యోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 3న ఆ పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వైసీపీలో చేరబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎల్లుండి ఏపీ సీఎం జగన్ ను కలవనున్నారు గంటా. తన కుమారుడు రవితేజ ను గంటా జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చనున్నట్లు తెలుస్తుంది. ఇందుకోసం విశాఖ నార్త్ వైసీపీ ఇంచార్జ్ కేకే రాజుకు అమరావతి నుంచి పిలుపు వచ్చినట్లు తెలుస్తుంది. ఎందుకంటే గంటా శ్రీనివాసరావు విశాఖపట్నం లోని భీమిలి నియోజక వర్గానికి ఎమ్మెల్యే అనే విషయం అందరికి తెలిసిందే. తన ప్రాంతంలోని ఎమ్మెల్యే పార్టీలో చేరబోతునందుకే కేకే రాజునూ కూడా అమరావతికి రావాల్సిందిగా చెప్పినట్లు సమాచారం. చూడాలి మరి అక్టోబర్ 3న ఎల్లుండి సీఎం జగన్ ను గంటా కలిసిన తర్వాత ఏం చేస్తారు అనేది