సీసీ కెమెరా ఉన్న ప్రదేశంలోనే దొంగతనం జరిగింది ఈ దారుణం మర్రిపాడు లో చోటుచేసుకుంది బాలయ్యను వ్యక్తి కొన్ని సంవత్సరాల నుంచి ఆటో నడుపుకుంటూ తన జీవనం సాగించు కుటుండేవాడు బుధవారం రోజు బాడుగ వింజమూరు కు కుదరడంతో బాలయ్య మంగళవారం రాత్రి 500 రూపాయలకు డీజిల్ పట్టించుకోని అన్నపూర్ణ హోటల్ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ లో తను అద్దెకు ఉండడం వల్ల ఆటోను అన్నపూర్ణ హోటల్ పక్కన నిలిపి తాను ఇంటికి వెళ్లి రాత్రి నిద్ర పోయాడు తెల్లవారి బుధవారం ఆటో ని స్టార్ట్ చేస్తుంటే ఆటో స్టార్ట్ కాకపోవడంతో ఆటో ను పరిశీలించిన బాలయ్య ఆయిల్ పైప్ ను ఎవరో కోసి అందులో ఉన్నటువంటి సుమారు పది లీటర్ల డివిజన్ను ఎత్తుకుపోయాడు అని తెలియజేసారు
ఈ సంఘటన మర్రిపాడు సెంటర్ లో ఉన్నటువంటి సీసీ కెమెరా ముందు జరగడం దారుణమని ఆటో బాలయ్య తెలియజేశాడు నాకు న్యాయం జరగాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తానని ఆయన తెలియజేశారు
మర్రిపాడు మండల తాసిల్దార్ గా 13 నెలలు పనిచేసి రేపు అనగా బుధవారం పదవి విరమణ పొంద బోతున్న సందర్భంగా సిబ్బంది మరియు డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ అభినందనలు తెలుపుతున్నారు.మీ సేవలను మేము మరువ లేము అని డిప్యూటీ తాసిల్దార్ అనిల్ కుమార్ గారు తెలిపారు అంతేకాకుండా మండల ప్రజలకు విశిష్ట సేవలు అందించి తనదైన శైలిలో కృషి సల్పారు.. కరోనా బారి నుండి మండల ప్రజలకు సూచనలు సలహాలు ఎప్పటికప్పుడు అందిస్తూ తన నిజాయితీని చాటుకున్నారు. ఒక డైనమిక్ తాసిల్దార్ గా రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా ప్రభుత్వ నిబంధనలే ఆయుధం గా పనిచేసి తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకున్నారు. ఎందరు తాసిల్దార్ లు మర్రిపాడు లో పనిచేసి వెళ్లిన డి వి సుధాకర్ కు సాటిరారు.. తాసిల్దార్ డి వి సుధాకర్ ఎక్కడ పని చేసిన గళం విప్పి మాట్లాడడం రెవెన్యూ చట్టాన్ని రైతులకు వివరించడం చట్టం ప్రకారమే పని చేయడం ఆయన నైజం. ఎలాంటి అవినీతికి తావు లేకుండా డి వి సుధాకర్ 13 నెలలు గా మచ్చలేని మనిషిగా మర్రిపాడు మండలంలో విధులు నిర్వహించి పదవి విరమణ పొందడం పై మండలంలోని ప్రజలు మీలాగా సేవ చేసేటటువంటి మండల తాసిల్దార్ రారు అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు
విజయ డైరీ ఎన్నికల్లో 86 ఓట్ల తేడాతో వైసిపి నేత కొండ్రెడ్డి రంగారెడ్డి ఘన విజయం.... కొండ్రెడ్డి అభినందించిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్.... ఇది వైసీపీ నేతల సమిష్టి విజయం.... నెల్లూరు జిల్లా ను శాసిస్తున్న రాజకీయ నేతలు తమ సత్తాను మరోసారి చాటారు.
విజయ డైయిరి ఎన్నికల్లో కొండ్రెడ్డి రంగారెడ్డి విజయం సాధించడం ఎంతో ఆనందకరమని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు... నెల్లూరు విజయ డైరీ లో మీడియాతో ఆయన శనివారం మాట్లాడుతూ ఆదాల ప్రభాకర్ రెడ్డి కి అత్యంత సన్నిహితంగా మెలుగుతూ మిగిలిన రాజకీయ నాయకులతో కూడా సత్సంబంధాలు కలిగిన వ్యక్తి కొండ్రెడ్డి రంగారెడ్డి అని ప్రశంసించారు. తాను రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి అనేక విషయాలలో అండగా ఉన్నారన్నారు... విజయ డైరీ కు సంబంధించి మూడు డైరెక్టర్లను వైసిపి గెలుపొందటం ఆనందకరమన్నారు... రంగన్న ను ఓడించేందుకు కొంతమంది కుట్రపన్నారని ఎద్దేవా చేశారు.. వీరి కుట్రలన్నీ నిష్ఫలంగా మారాయన్నారు. రంగారెడ్డిని ఓడగట్టేందుకు ఎన్నికలో ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థిని నిలబెట్టారన్నారు.....
అందరి కృషితో ఎన్నికల్లో గెలిచి చూపించామని అనిల్ పేర్కొన్నారు కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న దగ్గరుండి ఎన్నికలను పర్యవేక్షించడం పట్ల అభినందనలు తెలిపారు
మర్రిపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అత్యవసరంగా సమావేశమైన covid 19 టీం. మండల తాసిల్దార్ డి వి సుధాకర్. ఎస్ఐ వీరనారాయణ. పీహెచ్ డాక్టర్ వెంకట కిషోర్ ఈ సమావేశ ముఖ్యాంశం దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో మర్రిపాడు మండలం లోని50సం. పైబడిన ప్రతి ఒక్కరూ కరోనా టెస్ట్ లు చేయించుకోవాలని సూచించారు అలాగే ఎప్పటికప్పుడు శానిటైజర్ చేసుకుంటూ మాస్కులు ధరించి ఉండాలని తెలిపారు అలాగే ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు. గ్రామ వాలంటరీ లు వారిచేత కరోనా టెస్ట్ చేయించాలని ప్రెస్మీట్లో తెలిపారు