జలాశయం గేట్లు దాటుకొని లోపలికి వెళ్లి నీటి ప్రవాహం వద్ద వీళ్లు చేసిన హంగామా కు అక్కడ ఉన్న పర్యాటకులు భయభ్రాంతులకు గురయ్యారు..
వారించ బోయిన కానిస్టేబుల్ పో కూడా వీరు గొడవకు ప్రయత్నించారు.. మద్యం మత్తులో ఉన్నారని కానిస్టేబుల్ కూడా వీరిని అక్కడి నుంచి పంపించివేశారు..
ఈ యువకులది ఏ ఊరు అనేది డీటెయిల్స్ తెలియలేదు
నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం లో వరద నీటి ఉధృతి కారణంగా జలాశయం గేట్లు ద్వారా దిగువకు నీటి విడుదల చేసిన సందర్భంలో జలాశయాన్ని చూసేందుకు జిల్లా నలుమూలల నుండి భారీగా ప్రజలు వస్తూ ఉండడం వల్ల ప్రస్తుతం కోవిద్ నిబంధనలు అమలులో ఉన్నందున డ్యామ్ వద్ద సందర్శకుల రాకను సోమవారం నుండి నిలుపుదల చేస్తున్నట్లు సోమశిల ఎస్ఐ పి వి సుబ్బారావు గారు తెలిపారు.. అలాగే డ్యాం పై ఎటువంటి వాహనాలను కానీ పర్యాటకులను గానీ అనుమతి లేదని పర్యాటకులు ఈ విషయాన్ని గమనించ వలసిందిగా విజ్ఞప్తి చేశారు.... కావున బయట ప్రాంతానికి చెందిన ప్రజలు సోమశిల జలాశయం వద్దకు ప్రస్తుత కోవింద్ నిబంధనల పరిస్థితుల్లో రావొద్దని తెలియపరిచారు.. ఇదే విషయాన్ని రిజర్వాయర్ అధికారులు కూడా కోరి ఉన్నందున మా పోలీసు ఉన్నతాధికారుల సలహాతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఎస్ఐ పి వి సుబ్బారావు తెలిపారు
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తూ హిందూ దేవాలయాలపై ఏదో ఒక ప్రాంతంలో గత 16 నెలలుగా రధాలను ధగ్ధం చేయటం ,విగ్రహాలను దొంగలించటం జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడా కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదని రాష్ట్రీయ శ్రీరాంసేన అద్యక్షుడు కూనపరెడ్డి శ్రీనివాసరావు ఆరోపించారు. ఆయన శుక్రవారం స్ధానిక జర్నలిస్ట్ క్లబ్ నందు మీడియా సమావేశంలో మాట్లాడుతూ హిందూ దేవాలయాలపై జరిగిన దాడులను వ్యతిరేఖిస్తున్న వారిని రాష్ట్ర ప్రభుత్వం బైడవర్ సంతకాలు చేయిస్తూ సాదువుల పట్ల ,హిందూ ధార్మిక సంస్ధల పట్ల జగన్మోహన్ రెడ్డి రాక్షస ఆనందం పొందుతున్నారని తెలిపారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చలో అమలాపురం పిలుపును కోవిడ్ నిభందనలు పాటిస్తు మఖ్యనేతలకు పిలుపు ఇస్తే కావలిలో బిజెపి నేతలను,ధార్మిక సంఘాలను పోలీసులు బలవంతంగా సంతకాలు పెట్టించి బైడవర్ చేసుకుందన్నారు. అలానే కాబినెట్ హోదా ఉన్న నెహ్రు యువ కేంద్ర ఉపాద్యక్షుడు బిజెపి సీనియర్ నేత విష్ణువర్ధన్ రెడ్డిని పోలీసులు ఆయన గన్ మెన్ లను కూడా తోసివేసి రాత్రి నుంచి ఎక్కడకి తీసుకుని వెళ్లారో సమాచారం లేక ఆయన కుటుంబ సభ్యులు ఆయన మిత్రులం మేము చాలా ఆందోళన పడుతున్నామన్నారు. గత 15 తేది నుంచి పెద్ద వయిసు ఉన్న సాదువులను సైతం పోలీసులు పోటోలు తీసి బలవంతంగా సంతకాలు చేయిస్తు గ్రహనిర్బందాలు చేస్తున్నారని ఇది హేయమైన చర్య అన్నారు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్న జగన్మోహన్ రెడ్డికి త్వరలో తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గపడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు.