సంక్షేమానికి చిరునామా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
September 02, 2020
ap
,
atmakur
,
gowtam reddy
,
mekapati
,
minister
,
Nellore
,
ysrajasekharreddy vardhanthi
సంక్షేమానికి చిరునామా దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి : మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి*
* ఎవరైనా ఓ మనిషి దూరమైతే ఆ కుటుంబం మాత్రమే శోకంలో మునుగుతుంది. కానీ, తెలుగు రాష్ట్రాల ప్రజలు మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డిని కోల్పోయి దు:ఖించినపుడు కన్నీటిసంద్రంలా మారిందని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు డైకాస్ రోడ్ లోని మంత్రి క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ..ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆ మనసున్న మారాజు నిష్క్రమించి 11 ఏళ్లవుతున్నా ప్రతి తెలుగు వ్యక్తి ఇంకా ఆయన లేని లోటు నుంచి బయటపడలేకపోతున్నారన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి వైఎస్ జగనక్ మోహన్ రెడ్డి వరకూ వైఎస్ వసుదైక కుటుంబంలో 'మేకపాటి' కుటుంబం కూడా సభ్యులవడానికి మించినదేది లేదని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధి అనే పదం వినపడితే ప్రతి ఒక్కరికీ గుర్తొచ్చే స్థాయిలో..గుండెల్లో వైయస్సార్ శాశ్వతంగా నిలిచిపోయార మేకపాటి తెలిపారు. వ్యవసాయం, విద్య, వైద్యం, నీటి ప్రాజెక్టులు, ఇళ్లు ఇలా కోట్లాది మందికి సంక్షేమాన్ని అందించి వారి భవితను, తలరాతను మార్చడం వైఎస్ వల్లే సాధ్యమని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. అయితే తండ్రికి తగ్గ తనయుడిగా అవతరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూపంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వైఎస్ స్థాయి భరోసా దొరికిందనడంలో సందేహం లేదని మంత్రి అన్నారు. జననం, మరణం ప్రతి మనిషికి..పుట్టుక తప్ప చావులేని మనీషి వైఎస్ అని మంత్రి మేకపాటి స్మృతించి..ఘనమైన నివాళి పలికారు. వైఎస్ఆర్ వర్ధంతి కార్యక్రమంలో ఆత్మకూరు నియోజకవర్గ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.