ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
కేరళలోనీిని కరీపూర్ విమానాశ్రయంలో దుబాయి-కోళికోడ్ ఎయిరిండియా విమానం (ఐఎక్స్ - 1344) ల్యాండ్ అవుతుండగా రన్ వే మీద స్కిడ్ అయింది. ఈ ప్రమాదం రాత్రి 7.45 గంటలకు జరిగిందని కొండొట్టి పోలీసులు తెలిపారని ఏఎన్ఐ రిపోర్ట్ చేసింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు చనిపోయారని విదేశాంగ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి వి. మురళీధరన్ మనోరమ న్యూస్‌తో చెప్పారు.
ఈ విమానంలో 10 మంది చిన్నారులు, ఇద్దరు పైలట్లు, ఆరుగురు సిబ్బంది సహా 191 మంది ప్రయాణికులు ఉన్నారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రికి తరలిస్తున్ానమని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అడిషనల్ డీజీ (మీడియా) రాజీవ్ జైన్ చెప్పారు.
👉ల్యాండింగ్ సమయంలో రన్ వే పై రెండు ముక్కలైన విమానం..
కోజికోడ్: కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో రన్‌వే నుంచి ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ విమానం జారింది. ప్రమాదంలో పైలట్‌తో సహా ఇద్దరు మృతి చెందారు. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తుండగా రన్‌వే పైనుంచి జారింది. విమానంలో ఆరుగురు సిబ్బందితో సహా 191 మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తున్నారు. ప్రమాదంలో బోయింగ్ విమానం రెండు ముక్కలైంది.