ఇందిరమ్మ కాలనీలో మౌళిక వసతలు కల్పించండి.... పద్మావతి శ్రీదేవి.
ఇందిరమ్మ కాలనీలో మౌళిక వసతలు కల్పించండి.... పద్మావతి శ్రీదేవి.
కావలి ఇందిరమ్మ కాలనీలో మౌళిక వసతులు కల్పించాలని భారతీయజనతాపార్టీ నాయకురాలు పద్మావతీశ్రీదేవి డిమాండ్ చేసారు. ఆమె రైల్వేరోడ్డు లోని జర్నలిస్ట్ క్లబ్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మకాలనీ వాసులు నీటి కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మన్సిఫల్ అధికారులు వెంటనే స్పందించి వారికి నీటి వసతి కల్పించాలని కోరారు. అలానే వాళ్ళు పంపించే వాటర్ ట్యాంక్ లలో పాచి , కప్పలు ,మురుగునీరు వస్తుందని తెలిపారు. అలానే ఆ ప్రాంతంలో ఒక బోరు ఉంటే ఆ బోరును
మల్లికార్జున్ అనే అతను ఆ చేతీపంపు దగ్గర ఉన్న మోటరు ద్వారా నీళ్ళను పైపు వేసి టాంక్ లకు నీళ్ళపట్టి అమ్ముకుంటున్నాడని తెలియజేసారు. ఇది ఏమిటని ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారని తెలిపారు . అలానే అక్కడ రోడ్లు వసతి లేకుండా చాలా ఇబ్బందులకు గురౌతున్నారని తెలిపారు. వెంటనే పై సమస్యల పై ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి కూడా స్పందించి మౌలిక వసతులు కల్పించాలని కోరారు .ఈ విషయంను ఈ రోజు కావలి మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి ని కలసి సమస్యలను వివరించామన్నారు. మల్లికార్జున అనే అతనుపై కూడా డియస్పీ కి పిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఇందిరమ్మ కాలనీ వాసులు ఆలూరి సునందమ్మ , పులివెందల యసోదమ్మ , పాటిపర్తి ప్రమీల ,సుజాతమ్మ ,లక్ష్మీ కాంతమ్మ ,హభీమున్నీస పాల్గొన్నారు.