ఇళ్లకూరు, ఉత్తమనెల్లూరు లో 650మందికి పంపిణి...
April 30, 2020
Kota
,
nedurumalli
,
Nellore
,
vakadu
,
YSRCP
కరోనా లాక్ డౌన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో నెల రోజులు గా ప్రజలు ఇళ్లకే పరిమితం కావడంతో గ్రామీణ ప్రాంతాల్లోనీ ప్రజలు పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో కోట మండలంలోని సిద్దవరం గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత దువ్వూరు రాజ గోపాల్ రెడ్డి, కర్లపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సన్నారెడ్డి రాఘవ రెడ్డి లు ముందుకు వచ్చి మండలంలోని ఇల్లకూరుపాడు,ఉత్తమ నెల్లూరు గ్రామాల్లోని 650 కుటుంబాలకు గురువారం కూరగాయలు, కోడి గ్రుడ్డులు పంపిణీ కార్యక్రమం చేపట్టారు, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కోట మండల పరిషత్ అధికారిణి భవాని పాల్గున్ని ఆమె చేతులు మిందుగా కూరగాయలు, కోడిగ్రుడ్డులు అందజేశారు,ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కరోనా లాక్ డోన్ లాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో గ్రామ పెద్దలు రాజ గోపాల్ రెడ్డి,రాఘవ రెడ్డి లు ముందుకు వచ్చి 650 కుటుంబాలకు కూరగాయలు, కోడి గ్రుడ్డులు అందజేసి వారి దాతృత్వాని చాటారు అనీ, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అన్నారు, దువ్వూరు రాజ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ లో సిద్దవరం, ఉత్తమ నెల్లూరు గ్రామ ప్రజలకు తమ వంతు సహకారం అందించండి జరిగిందని ఆయన అన్నారు, రాఘవ రెడ్డి మాట్లాడుతూ కరోనా లాక్ డౌన్ లో ప్రజలు ఇళ్లకే పరిమితం కావాలని, బయటకు రావద్దు అనీ, ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటించి,వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి ఆయన కోరారు, ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నేదురుమల్లి అనిత రెడ్డి, మీజూరు మాధవ్, ఆవుల సుబ్బయ్య, జంగిటి వాసు, మురళి, మీజూరు ఏడుకొండలు, వాలేంటర్లు , గ్రామ యువత తదితరులు పాల్గొన్నారు,*