లాక్ డౌన్ లో తిరిగితే కేసులే... అదనపు ఎస్పీ
లాక్ డౌన్ లో బయట తిరిగితే కేసులే.
అడిషనల్ ఎస్పీ వెంకట రత్నం.
నాయుడుపేట ************
కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తుండంతో ఇళ్ల నుండి ఎవరు అనవసరంగా బయటకు రాకూడదని అలా మాట వినకుండా వచ్చిన వారిపై కేసులు నమోదు చేస్తామని అడిషనల్ ఎస్పీ వెంకట రత్నం తెలిపారు. గూడూరు వెంకటగిరి కరోన జోన్లను పరిశీలిస్తూ ఆమె శుక్రవారం నాయుడుపేట కు విచ్చేశారు.
నాయుడుపేట పట్టణంలో రెడ్ జోన్ ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో కరోన వైరస్ ఎక్కువగా విస్తరిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఇళ్ల నుండి బయటకు రాకూడదని తెలిపారు. ముందుగా పట్టణంలో ఉన్న ప్రజలందరికీ పోలీసులు హెచ్చరిస్తున్నారు అని తెలిపారు. అనంతరం మాటవినని పరిస్థితుల్లో వాళ్లపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు.