వైసీపీ నాయకుల కనుసన్నల్లో రాష్ట్ర సరిహద్దు దాటుతున్న ఇసుక
అధికారపార్టీ అండదండలు ఉంటేనే ఇసుక
సామాన్యులకు తప్పని ఇసుక ఇక్కట్లు - చేజర్ల
సామాన్యులకు తప్పని ఇసుక ఇక్కట్లు - చేజర్ల
రాష్ట్రంలో సామాన్యులకు మాత్రం ఇసుక దొరకడం లేదని,వైసీపీ నాయకులు అండదండలు ఉన్న వారికి మాత్రం సులువుగా ఇసుక దొరుకుతుందని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యలయములో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధానకార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక ఇస్తుంటే,మేము అధికారంలోకి వస్తే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కంటే తక్కువ ధరకు ఇసుక ఇస్తామని చెప్పి నేడు ఇసుకే దొరకకుండా చేసారని,తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేవలం రవాణా ఛార్జీల మాత్రమే చెల్లించే వారని,అందువలన ట్రాక్టర్ ఇసుక వెయ్యి రూపాయలకు ఇంటికి చేరేదని,నేడు ఒక ట్రాక్టరు ఇసుక 4 వేలు పెట్టిన దొరకడం లేదని,ఇళ్ల యజమానులు ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న ఇసుక దొరకడం లేదని అదే అధికారపార్టీ వారిని సంప్రదించి వారు అడిగిన ధర ఇస్తే మాత్రం ఎంత ఇసుక అయినా దొరుకుతుందని,వైసీపీ నాయకులు అండదండలతో యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు ఇసుక వెళుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారని,రాష్ట్రంలో ఇసుక కష్టాలు వలన భవన నిర్మాణ రంగం కుదేలయిందని, సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలన్న ట్రాక్టరు ఇసుక 4 వేలు పెట్టి కొనలేక ఇంటి నిర్మాణాలనే వాయిదా విసుకుంటున్నారని దీని వలన భవన నిర్మాణ కార్మికులు పనులు లేక పస్థులు ఉంటున్నారని,తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఉచితంగా ఇసుక ఇచ్చిన నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నాయకులు ఇసుకను దోసుకున్నారని దృష్ప్రచారం చేసారని,నేడు వారి పాలనలో సొంత పార్టీ నాయకులు ఇసుక దోపిడీ చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తుంటే ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారని,రాష్ట్రములో అధికారపార్టీ నాయకులు రిచ్ లలో సి సి కెమెరాలు ఆపివేసి ఒకే పర్మిట్ మీద అనేక ట్రిపులు ఇసుక తరలిస్తున్నారని, అదేవిధముగా ఆన్ లైన్ నమోదు చేసుకోవడానికి మీ సేవ కేంద్రాలకు వెలితే సర్వర్ పనిచేయలేదంటారు,అదే వైసీపీ నాయకులు దగ్గరికి వెళ్లి వారు చెప్పిన ధర ఇస్తే ఎంత ఇసుక అయినా దొరుకుతుందని దీనిని బట్టి రాష్ట్రంలో అధికారపార్టీ కను సన్నలలో ఇసుక రిచ్ లు నడుస్తున్నాయని అర్ధమవుతుందని,అధికారపార్టీ నాయకులకు దోచిపెట్టేందుకే ముఖ్యమంత్రి గత ప్రభుత్వ ఇసుక పాలసీని రద్దు చేసి కొత్త పాలసీని తెచ్చారని,ముఖ్యమంత్రి కి ప్రజల పై ఏమాత్రం ప్రేమ ఉన్న ఇప్పటి ఇసుక పాలసీని రద్దు చేసి గత ప్రభుత్వం లో ఉన్న ఉచిత ఇసుక పాలసీని తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ తరుపున డిమాండ్ చేస్తున్నాము. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దారా విజయబాబు, శివుని రమణారెడ్డి,పాలపార్టీ శ్యాం,ఇందుపురు మురళీ కృష్ణారెడ్డి, అగ్గి మురళి,పి ఆదిశేషయ్య, ఇంటూరు విజయ్,సాయి రోశయ్య మస్తాన్,గరికిపాటి అనిల్,బాబు, తదితరులు పాల్గొన్నారు.