మహిళలు ఎదిగేందుకు చక్కని అవకాశం
నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
మహిళలు పారిశ్రామికవేత్తలు గా ఎదిగేందుకు ఇది మంచి అవకాశమని నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తెలిపారు .ఎం ఎస్ ఎం ఈ, వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో నిర్వహించిన మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సులో ఆయన మాట్లాడారు . ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటువంటి అవకాశం చాలా అరుదుగా మాత్రమే లభిస్తుందని పేర్కొన్నారు. పలువురు అధికారులు ఇక్కడ అందుబాటులో ఉన్నారని, వారిని వినియోగించుకోవాలని తెలిపారు .పలువురు మహిళలు తాము ఉత్పత్తి చేసిన వస్తువులను ఇక్కడ ప్రదర్శించడం అభినందనీయమని తెలిపారు. గతంలో మహిళలు పరిశ్రమలు పెట్టేందుకు ముందుకు వచ్చేవారు కాదని ,అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉందని అభిప్రాయపడ్డారు. పొదుపు లక్ష్మి మహిళల ద్వారా మాత్రమే ఈ మార్పు సాధ్యం అయిందని తెలిపారు. ప్రభుత్వాలు మహిళలకు ఇచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం బేటి బచావో బేటి పడావో కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందని, తద్వారా మహిళలు ఆర్థిక స్వావలంబన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. అప్పుడే ప్రధాన మంత్రి మోడీ లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు .నెల్లూరు లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ మెంబర్ వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, అబూబకర్, ఇక్బాల్, సుధాకర్ రెడ్డి, మధు అధికారులు చంద్రశేఖర్, ప్రసాద్ విచ్చేసారు. ఈ కార్యక్రమాన్ని వసంత లక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ వసంత లక్ష్మి చక్కగా నిర్వహించారు. అంతకుముందు మహిళలు ఉత్పత్తి చేసిన పలు రకాల వస్తువులను ఎంపీ పరిశీలించి అభినందించారు.