నెల్లూరు జిల్లాలోని మనుబోలు దగ్గరగా నున్న కొమ్మలపూడి జాతీయ రహదారిపై నెల్లూరు వైపుఅధిక లోడుతో వెళుతున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది . వెనుక వైపు నుండి ద్విచక్ర వాహనంలో వేగంగా వస్తున్న నెల్లూరు మాగుంట లేఔట్ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకులు ఆటోను ఢీకొనడంతో గాయాల పాలయ్యారు. ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆగడంతో అక్కడకు చేరుకున్న స్థానికులు అంబులెన్స్ మరియు హైవే సిబ్బందికి తెలియజేయడం జరిగింది.
నెల్లూరు: నెల్లూరు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాకాణి గోవర్థన్ రెడ్డి మాట్లాడుతూ,జిల్లా సమీక్షా సమావేశంలో చర్చించిన విషయాలు పరిష్కారం అయ్యేలా చూడాలి.ప్రతి సమావేశంలో గత సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటే పరిష్కారం ఎప్పుడూ దొరుకుతుంది!.ఇడిమేపల్లి కాలువ గురించి గత సమావేశంలో అడిగినా ఇంత వరకు ముందుకు సాగని పరిస్థితి.మన స్థాయిలో తీసుకోవలసిన నిర్ణయాలు కూడా తీసుకొని రైతులకు న్యాయం చేయలేకపోతే ఈ సమావేశం ఎందుకు!.గతంలో మనం ఇచ్చిన పట్టాలు, రైతుల అనుభవంలో ఉన్న భూములకు కూడా రైతుల పేరుతో రాయలేక పోతున్నాము.దానివల్ల రైతులకు ఈ- క్రాప్ బుకింగ్ లేకుండా పోయింది, రైతు భరోసా అందలేదు, ధాన్యం అమ్ముకోలేక పోతున్నారు,ఇతర సంక్షేమ పథకాలు అందని పరిస్థితి.కమిటీలతో కాలయాపన తప్ప రైతులకు న్యాయం జరగడం లేదు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తేమ శాతం కనిపెట్టడానికి మిల్లర్ల వద్ద ఉన్న మీటర్లు, కొనుగోలు కేంద్రాలలో ఉన్న మధ్య తేడా వస్తుందడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు.ధాన్యం ఆరబెట్టుకోవడానికి అవకాశం లేని చోట్ల ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి.గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఇతర జిల్లాలకు వెళ్లాలని చెప్పడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.అందువల్ల ప్రస్తుతం కొనుగోలు విషయంలో అన్ని సమస్యలను దృష్టిలో పెట్టుకొని, గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకూడదు.గతంలో ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను మోసం చేశారు.ఈసారి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉంది.వెంకటాచలంలో రూ-అర్బన్ పధకం కింద మంజూరైన నిధులను పూర్తి స్థాయిలో వాడుకోలేక పోతున్నారు. సకాలంలో అనుమతులిచ్చి, రూ-అర్బన్ పధకం కింద చేపట్టవలసిన అన్ని పనులను పూర్తి చేయండి.పింఛన్ల విషయంలో వివిధ కారణాలతో కొన్ని తొలగిపోయాయి.గతంలో చేసిన సర్వేలను ప్రక్కన పెట్టి, వాస్తవాలను పరిగణలోకి తీసుకొని పింఛన్లు మంజూరు చేయాలి.రేషన్ కార్డుల మంజూరులో కూడా ఎటువంటి గందరగోళం జరగకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలి.సాగునీటి విషయంలో అభ్యంతరాలతో రైతులు పంటలు పండించుకోలేక తీవ్ర నష్టపోతున్నారు.రైతులు సొంతంగా కాలువ తవ్వుకుంటామన్నా అటవీ శాఖ అనుమతులు ఎందుకు ఇవ్వలేక పోతున్నారు!.ఇడిమేపల్లి కాలువకు సంబంధించి ఒక్క అడుగు ముందుకు వేస్తే నాలుగు అడుగులు వెనక్కి వేసే పరిస్థితి.అధికారులు ఈ విధంగా నిర్లక్ష్యంగా చేసి పనులు కాకుండా చేస్తుంటే, రైతుల మధ్య మేము ఏవిధంగా తిరగాలి!.అటవీ శాఖ అధికారులు ఎందుకు కక్ష్య సాధింపు చర్యలు చేస్తున్నారో అర్థం కావడం లేదు!.మైనింగ్ అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ కొందరిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు.సకాలంలో ఇసుక అందించలేకపోతే, గ్రామాలలో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతుంది.అధికారులు కథలు చెప్పడం మాని, ఇసుక సమస్యను పరిష్కరించాలి.గ్రామాలలో అభివృద్ధి పనులకు గ్రామస్థులు అవసరాలకు గ్రావెల్ ను వినియోగించుకోనివ్వ కుండా మైనింగ్ అధికారులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారు.గ్రావెల్ అక్రమార్కుల ఆట కట్టించాలి కానీ వారిని వదిలి,గ్రామస్తులను ఇబ్బందుల పాలు చేయడం సరికాదు.పేదల ఇళ్ల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్ల అభివృద్ధి పనులకు గ్రావెల్ తరలింపు అనుమతుల అధికారం మండల స్థాయి అధికారులకే కట్టబెట్టండి.సమస్యలన్నింటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించుకోలేకపోతే, ఈ సమావేశాలకు అర్ధం ఉండదు అన్నారు.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇన్‌ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సమక్షంలో మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీలో చేరారు.భానుశ్రీ పార్టీలో చేరడం అభినందనీయం, ఆమెకు ఉన్నత స్థాయి పదవిని స్థానిక మంత్రి అనీల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కల్పిస్తారని జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రజల ఇంటికే సంక్షేమ పధకాలు వచ్చే విదంగా ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. త్వరలో కార్పోరేషన్ ఎన్నికలు రానున్నాయని, వాటిలో రూరల్,
సిటిలోని మొత్తం స్థానాలు వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఇరిగేషన్ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ తెలిపారు. భానుశ్రీ గౌరవం ఏ మాత్రం తగ్గకుండా చూస్తామని ఆమె సూచనలు, సలహాలు తీసుకుంటూ, కార్పొరేషన్ ఎలక్షన్స్ లో ముందుకు వెళ్తామని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేరుస్తున్నారని భానుశ్రీ పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది జిల్లా కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఛైర్మన్ ఆనం విజయ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
వీధి కుక్కల నియంత్రణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని నగర పాలక సంస్థ వెటర్నరీ వైద్యులు డాక్టర్ మదన్ మోహన్ పేర్కొన్నారు. వీధికుక్కల నియంత్రణలో భాగంగా జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలో సంచరిస్తున్న కుక్కలను గురువారం ఉదయం పట్టుకుని, ప్రత్యేక బోనులో పాత మున్సిపల్ ఆఫీసు సమీపంలోని శస్త్ర చికిత్సా కేంద్రానికి తరలించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాట్లాడుతూ విచ్చలవిడిగా పెరిగిపోతున్న వీధి కుక్కలను తగ్గించడానికి శస్త్ర చికిత్సలే ఉత్తమ విధానమని, సుశిక్షితులైన పారిశుద్ధ్య విభాగ సిబ్బంది ఆధ్వర్యంలో అన్ని ప్రాంతాల్లో కుక్కల నియంత్రణా చర్యలు చేపడుతున్నామని వివరించారు.
చిట్టమూరు ప్రాథమిక ఆరోగ్యకేంద్రంవద్ద పి.హెచ్.సిలో మంగళవారం ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ కార్యక్రమం జరిగింది. ప్రతి గర్భవతిని వైద్యాధికారి భాస్కర్ రెడ్డి వైద్య పరీక్షలు నిర్వహించారు. గ్రూఫింగ్,హీమోగోబిన్, బి.పి,ఘగర్, ఆర్.బి.ఎస్ రక్త పరీక్షల నిర్వహించి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. పోషకాహారం ప్రాధాన్యత గురించి తెలిపారు. రక్తహీనత గల గర్భిణీలకు సెలైన్ ద్వారా ఐరన్ సుక్రోజ్ అందించారు. ప్రధానంగా ప్రత్యేక గర్బవతి ఆసుపత్రిలోనే ప్రసవించేలా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలిని సూచించారు. ఆశ ఆరోగ్య కార్యకర్తలు ప్రసవంనాడు గర్భవతి వెంట వెళ్లాలని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆశా, ఆరోగ్య సిబ్బంది సూపర్వైజర్లు పాల్గొన్నారు.
నూతనంగా ప్రవేశపెట్టిన మొబైల్ యాప్ ద్వారా ప్రతీ ఇంట్లో కుటుంబ సభ్యులందరి పూర్తి వివరాలను నమోదు చేసేందుకు అవకాశముందని నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ గోపి పేర్కొన్నారు. మొబైల్ యాప్ నిర్వహణపై వార్డు అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శులకు అవగాహనా సదస్సును సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ మాట్లాడుతూ వార్డు వలంటీరు పరిధిలోని ఆయా ఇండ్లలో మొబైల్ యాప్ ను వినియోగించి కుటుంబ సర్వే చేపడతారని, సర్వే ద్వారా కుటుంబ సభ్యుల వివరాలు, పేర్లలో అక్షర దోషాలు వంటి వివిధ అంశాలను నమోదు చేస్తారని తెలిపారు. నగర పాలక సంస్థ ద్వారా మొత్తం మూడు వేల మొబైళ్లను ఇప్పటివరకు వార్డు వలంటీర్లకు అందజేసి అన్ని డివిజనుల్లో సర్వే కార్యక్రమం నిర్వహిస్తున్నామని ఆయన వెల్లడించారు. మొబైల్ యాప్ ద్వారా వార్డు వలంటీర్లు, వార్డు కార్యదర్శుల దైనందిన హాజరు నమోదు కూడా అమలు చేయనున్నామని అడిషనల్ కమిషనర్ వివరించారు.
నెల్లూరు, పిబ్రవరి 11, (రవికిరణాలు) : “మూర్చకు మోక్షం" అనే నినాదంతో మూర్చవ్యాధికి ఆధునిక శస్త్రచికిత్సలను అందుబాటులోనికి తీసుకుని వచ్చి, ఒకే సంవత్సరంలో దేశంలోనే అత్యధిక, విజయవంతమైన శస్త్రచికిత్సలు నిర్వహించిన హాస్పిటల్ గా నారాయణ హాస్పిటల్ ప్రత్యేక ఘనతను సాధించింది. మూర్ఛవ్యాధిగ్రస్తులు చాలా మంది సమాజంలో స్వేచ్చగా తిరగలేక, మానసికంగా కృంగిపోతుంటారు. కారణం ముర్చవ్యాధి సమయం, సందర్భం ముందస్తు హెచ్చరికలు లేకుండా హఠాత్తుగా వస్తుంది. మూర్చవ్యాధి గ్రస్తులకు వివాహం చేయాలన్నా, ఉన్నత చదువులు చదవాలన్నా, దూర ప్రయాణాలు చేయాలన్నా, చేయలేక సమాజంలో మానసిక వికలాంగులుగా మిగిలిపోతుంటారు. క్రమం తప్పకుండా మందులు వాడటం కూడా కొంత మందికి ఆర్థిక భారం వలన వీలు కాక మరణాలు సంభవించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఈ సమస్యను సమూలంగా రూపుమాపి, సరికొత్త వైద్య విధానంతో నారాయణ న్యూరో సైన్సెస్ విభాగం శ్రీకారం చుట్టింది.నారాయణ న్యూరాలజి విభాగాధిపతి డాక్టర్ ఎన్.ఎస్. సంపత్ కుమార్ నేతృత్వంలో ఎపిలెప్సీ స్పెషలిస్ట్ డాక్టర్
రావిష్ కెన్ని రాజీవ్, న్యూరోసర్జన్ల బృందం ఈ శస్త్రచికిత్సలకు శ్రీకారం చుట్టడం జరిగింది. దక్షిణ భారతదేశంలో నారాయణ హాస్పిటల్ లో మాత్రమే అందుబాటులో గల 64 ఛానల్ వీడియో ఇ.ఇ.జి, 3 టెస్లా ఎమ్మారై, అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రత్యేక యంత్ర పరికరాలు కలిగిన ఆపరేషన్ థియేటర్ల సహకారంతో ఈ శస్త్రచికిత్సలు నిర్వహించడం జరిగింది. ఈ శస్త్రచికిత్సల కోసం నిర్వహించిన ప్రత్యేక శిబిరంలో 300 మందికి పైగా మూర్చవ్యాధిగ్రస్తులు వైద్య చికిత్సల కోసం రాగా వారందరికి ఎమ్మారై వంటి ఖరీదైన పరీక్షలతోపాటు సుమారు రూ.16,000 పైగా విలువైన వైద్య పరీక్షలు, సేవలు ఉచితంగా అందించడం జరిగింది. ఈ 300 మందిలో 42 మందికి శస్త్రచికిత్సలు అవసరమని డాక్టర్ సంపత్ కుమార్ బృందం నిర్ధారించింది. అందులో ఇప్పటి వరకూ 11మంది పురుషులు, 10 మంది మహిళలు మొత్తం 21 మందికి డా॥ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించి, 100 శాతం విజయవంతమయ్యేలా కృషిచేశారు. శస్త్రచికిత్స చేయించుకున్న వారిలో 14-48 సం||ల మధ్య వయస్సు కలిగిన వారు ఉండడం గమనార్హం.ఈ అంతర్జాతీయ మూర్చదినం మూర్చవ్యాధిగ్రస్తులందరికీ ఒక శుభదినంగా భావించవచ్చు. శస్త్రచికిత్స చేయించుకున్న అందరూ కూడా సాధారణ జీవితం గడుపుతూ తమతమ కుడుంబాలలో ఆరోగ్య వెలుతురులు
నింపారు. నారాయణ న్యూరోసైన్సెస్ విభాగంలోని ఈ ఎపిలెప్సీ బృందం, పరికరాల సహకారంతో మూర్ఛరహిత సమాజం కోసం కృషిచేసి ఆరోగ్యకరమైన స్వతంత్ర జీవితాలు మూర్ఛరోగులు గడిపేందుకు కృషిచేస్తుంది. మూర్ఛవ్యాధి పై ప్రజలకు అవగాహన కలిగించి 80% కు పైగా మూర్ఛవ్యాధిగ్రస్తులను మందులతోనే నయంచేసే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి నారాయణ న్యూరోసైన్సెస్ విభాగం ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుందని డా ఎన్.ఎస్. సంపత్ కుమార్ తెలిపారు.