మండలి చైర్మన్ ను మతం పేరుతో దూసించిన బొత్సను మంత్రి పదవి నుంచి తొలిగించాలి
మంత్రుల భాష,ప్రవర్తన సభ్యసమాజం తలదించుకొనేవిధంగా ఉంది - చేజర్ల
కోవూరు, జనవరి 23, (రవికిరణాలు) : ముఖ్యమంత్రి వైయెస్ జగన్మోహన్ రెడ్డి పులివెందుల పాక్ష్యానిజంను చట్టసభలకు విస్తరింపచేసారని, అందులో భాగంగానే మండలిలో నిబంధనల ప్రకారం వ్యవహరించిన మండలి చైర్మన్ ఏంఏ షరీఫ్ పై దాడి చేయడానికి మంత్రులు ప్రయత్నించారని కోవూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో మంత్రులు వాడుతున్న భాష,వారి ప్రవర్తన సభ్యసమాజం తలదించుకునేలా ఉందని, వారు మంత్రులో బజారు రౌడీలో అర్ధంకావడము లేదని,వికేంద్రీకరణ పేరుతో రాష్ట్రంలో మూడు రాజధానులు ఏర్పాటు చేయడము కొరకు మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లును రాజ్యాంగ నిబంధనలకో లోబడి మండలి చైర్మన్ ఆ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపుతూ నిర్ణయం తీసుకొన్న తరువాత మంత్రి బొత్స సత్యనారాయణతో సహా అనేక మంది మంత్రులు ఆయనపై దాడి చేయడానికి ప్రయత్నం చేయడము తో పాటు, ఆయన మతాన్ని కించపరుస్తూ మాట్లాడారని, బొత్స సత్యనారాయణ షరీఫ్ ని నీవు సాయిబ్బులకే పట్టవా అని మాట్లాడినట్లు పత్రికలలో వార్తలు చూశామని, ఇది ఒక్క షరీఫ్ నే అవమానించినట్లు గాదాని,మొత్తం ముస్లిం సమాజాన్నే అవమానించడమేనని,ఒక మతాన్ని కించపరిచేవిధంగా మాట్లాడిన బొత్స సత్యనారాయణ ని వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలని,అదేవిధముగా మండలిలో మంత్రులు తెలుగుదేశం పార్టీ సభ్యులపై దాడి చేయడానికి ప్రయత్నం చేయడము జరిగినదని, నారా లోకేష్ పై దాడి చేయడానికి మంత్రులు ప్రయతించగా తెలుగుదేశం పార్టీ సభ్యులు కాపాడారని, ఈ ప్రభుత్వం లో ప్రతిపక్ష సభ్యులకు చట్టసభలలోనే రక్షణ లేకుండా పోయిందని కావున గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని నిన్న మొన్న సభల్లో జరిగిన విషయాలు పై విచారించి తగిన చర్యలు తీసుకొని ప్రజాస్వామ్యం ను కాపాడాలని, అదేవిధముగా మంత్రులు అనేక రకాలుగా వత్తిడి చేసినా, బెదిరించినా లెక్క చేయకుండా మండలిలో వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపి రాష్ట్రాన్ని రక్షించిన మండలి చైర్మన్ ఏంఏ షరీఫ్ కి తెలుగుదేశం పార్టీ తరుపున అభినందినలు తెలియచేస్తాన్నామని అన్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఏలూరు కృష్ణయ్య, కలువాయి చెన్నకృష్ణారెడ్డి, ఇందుపురు మురళీకృష్ణ రెడ్డి, ఒబ్బారెడ్డి మల్లికార్జున రెడ్డి, పాలూరు వెంకటేశ్వర్లు, బుధవరపు శివకుమార్, పూల వెంకటేశ్వర్లు, దువ్వూరు రంగారెడ్డి, అగ్గి మురళి, జానకిరామ్, నారాయణ రెడ్డి, జక్కంరెడ్డి భాస్కర రెడ్డి, అగ్గి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.