కార్యక్రమానికి వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు. 




వైయస్ఆర్సీపీ పోరుబాటకు భారీగా కార్యకర్తలు. 

ముత్తుకూరు, డిసెంబర్ 27( మేజర్ న్యూస్) వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరెంటు చార్జీలు బాదుడుపై వైఎస్ఆర్సిపి పోరుబాట అనే కార్యక్రమాన్ని నిర్వహించగా శుక్రవారం పంటపాలెం గ్రామం నుంచి పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు నాయకులు అక్కడికి వెళ్లారు. స్థానిక సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. అక్కడికి వెళ్లి పార్టీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డిని కలిసినారు. కార్యక్రమానికి వచ్చినందుకు పార్టీ నాయకత్వం పంటపాలెం కార్యకర్తలను అభినందించింది. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.