వైయస్ఆర్ సీపీ విద్యుత్ పోరుబాట విజయవంతం. మోసపు హామీ లతో ప్రజలను మోసం చేసిన చంద్రబాబు




 

ఉదయగిరి మేజర్ న్యూస్:

 ఉదయగిరి లో వైఎస్ ఆర్ సిపి శుక్రవారం తలపెట్టిన విద్యుత్ పోరుబాట విజయవంతం అయింది నియోజకవర్గం వైఎస్ ఆర్ సిపి ఇంచార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తొలుత ట్యాంక్ బండ్ వద్ద గల వైయస్సార్  విగ్రహం వద్దా మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం వైఎస్ఆర్సిపి నియోజకవర్గ నాయకులతో కలిసి ర్యాలీగా విద్యుత్ సముదాయానికి చేరుకొని డి ఈకి వినతి పత్రం అందజేశారు అనంతరం స్థానిక పంచాయతీ బస్టాండ్ ఆవరణలో ఏర్పాటుచేసిన   విలేకర్ల తో మాట్లాడుతూ . కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని, ప్రజలపై మోపిన అదనపు విద్యుత్ ఛార్జీల భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు   ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలపై అదనపు విద్యుత్తు చార్జీల భారాన్ని మోపడం దారుణమన్నారు.  ఎన్నికలకు ముందు విద్యుత్తు చార్జీలు పెంచము, ప్రజలపై భారం పడకుండా విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మోసపూరితమైన హామీలు ఇచ్చినా చంద్రబాబు నాయుడు ఇప్పుడు ప్రజలపై  అదరపు విద్యుత్ ఛార్జీలు మోపడం దారుణం అన్నారు. సూపర్ సిక్స్ హామీలను ఆరునెలలు గడుస్తున్న ఒక్క హామీ నెరవేర్చలేదు అన్నారు. ప్రజలను మోసం చేయడం లో చంద్రబాబు దిట్ట న్నారు.జగన్ పిలుపు తో . ఏకతాటిపై వైఎస్ఆర్సీపీ శ్రేణులు అందరూ ఏకతాటిపై కలసి వచ్చి కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా ర్యాలీని విజయవంతం చేశారు. ప్రజల పక్షాన పోరాటం పేరుతో వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన ర్యాలీ ని విజయవంతం చేసిన అందరికి ధన్యవాదములు తెలిపారు ఈ కార్యక్రమం లో ఉదయగిరి దుత్తలూరు సీతారామపురం వింజమూరు జడ్ పి టి సి లు మోడీ రామాంజనేయులు లెక్కల లక్ష్మి కాంతమ్మ, రమణారెడ్డి, బాలకృష్ణ రెడ్డి, కన్వీనర్ లు గానుగపెంట ఓబుల్ రెడ్డి, చింతం సుబ్బారెడ్డి, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, మండల తిరుపతి నాయుడు, శ్రీనివాసులు, రవీంద్రారెడ్డి, మాల్యాద్రి రెడ్డి, చేజర్ల సుబ్బారెడ్డి, అలీ అహమద్, ఖిల్జి సలీం, రమణారెడ్డి, రాజా, జనార్దన్ రెడ్డి, సలీం, హరి, టింకర్ బాబు, తిరుపతి రెడ్డి, అక్కుల్ రెడ్డి, లెక్కల మాలకొండారెడ్డి, మీసాల సుబ్బారాయుడు, డేగ వంశీ, నరసింహారెడ్డి, మూర్తుజా, ఎసదని, జి. శ్రీనివాసులు రెడ్డి కె వెంకటరెడ్డి, అక్కి భాస్కర్ రెడ్డి, యు గురవయ్య, పెంచలయ్య, రియాజ్ తదితరులు పాల్గొన్నారు.