మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన నివాళి




నెల్లూరు కార్పొరేషన్ (మేజర్ న్యూస్):

మాజీ ప్రధాని, పద్మ విభూషణ్ మన్మోహన్ సింగ్ మృతి కి  కాంగ్రెస్ పార్టీ నగరంలోని ఇందిరా భవన్ లో శుక్రవారం ఘనంగా నివాళులర్పించింది. డి సీసీ అధ్యక్షుడు చేవూరు దేవకుమార్ రెడ్డి సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ  నిజాయితీపరుడు నిరాడంబరుడు ఆర్థికవేత్త సంక్షోభ సమయంలో భారతదేశాన్ని అభివృద్ధి పదములో తీసుకొచ్చేందుకు అహర్నిశలు కృషి చేసిన మహానుభావుడు మన్మోహన్ సింగ్ అని ఉపాధ్యక్షుడు బాల సుధాకర్ గుర్తు చేసుకున్నారు.  కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆయన మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు ఆయన ఆశయాలను కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో ముఖ్య నాయకులు మోహన్ రెడ్డి, అల్లావుద్దీన్, మల్లికార్జున్ రెడ్డి, లీగల్ సెల్ సుధీర్, యూత్ కాంగ్రెస్ గణేష్ , సుజాత సేవాదళ్, ఇర్ఫాన్, కిషోర్, రెహమాన్ హాజీ అనీఫ్ ఆదినారాయణ సమీర్ బద్రి తదితరులు పాల్గొన్నారు.