నరసింహస్వామి కి తిరుప్పావడ సేవ




నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ పై వేంచేసియున్న శ్రీ వేదగిరి లక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం నందు  గురువారం నాడు  స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి నక్షత్రం సంధర్బంగా మూలవర్లకు అభిషేకం మరియు  తిరుప్పావడ సేవ కార్యక్రమాలు ప్రధాన అర్చకులు శ్రీ  భాస్కరాచార్యులు గారి ఆధ్వర్యంలో వైభవంగా శాస్త్రోక్తముగా జరిగాయి. పై పూజా కార్యక్రమంలో అర్చకులు శ్రీ కృష్ణమాచార్యులు,శ్రీ మురళీధరాచార్యులు మరియు దేవస్థాన సిబ్బంది పాల్గొన్నారు అదేవిధంగా ధనుర్మాస ప్రాతఃకాల దీపారాధన మరియు తిరుప్పావై ప్రవచన కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి అని ఆలయ అధికారులు తెలిపినారు.