భూగర్భ జలాలు అడుగెంటుతున్నాయ్ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది
భూగర్భ జలాలు అడుగెంటుతున్నాయ్ పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉంది
నెల్లూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లాలోని ముత్తుకూరు మండలంలో పరిశ్రమలు అధికంగా రావడం వల్ల భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటుతున్నాయని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యుడు శ్రీరాములు వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం నెల్లూరు జిల్లా జర్నలిస్ట్ భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ముత్తుకూరు మండలంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పరిశ్రమలకు నీరు లేకపోయినా బోర్లు ద్వారా నీళ్లను తోడేస్తున్నారని దీనివల్ల ఈ ప్రాంతంలో నీళ్లు లేక అవస్థలు పడుతున్నారని చెప్పారు. ముత్తుకూరు మండలంలో ఉన్న పారిశ్రామిక వేత్తలకు, అధికారులకు వాల్టా చట్టం ఉందని మర్చిపోయారని గుర్తు చేశారు. గతంలో పది అడుగుల్లో నీరు వచ్చే ముత్తుకూరు మండలంలో ప్రస్తుతం 70 అడుగులు తవ్విన నీరు చెప్పారు. బోర్ల ద్వారా ప్రైవేటు వ్యక్తులు నీరును తోడేసి పరిశ్రమలకు అమ్మేస్తున్నారని ఆరోపించారు. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంవల్ల పర్యావరణం, వాతావరణ కాలుష్యం పూర్తిగా దెబ్బతింటుందని దీనిపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు ఫిర్యాదు చేయడం జరిగిందని జరిగిందన్నారు. వారు స్పందించి ఈ ప్రాంతంలో భూగర్భ జలాలను పరిశీలించేందుకు సెంట్రల్ ఎన్విరాన్మెంట్, పొల్యూషన్, భూగర్భ జలాల అధికారులు స్పందించి దీనిపై సమగ్ర రిపోర్టు ను అందించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం కు ఆధారాలతో సహా తీసుకొని రమ్మని పిలవడం జరిగిందన్నారు. ముత్తుకూరు మండలం భూగర్భ జలాలపై సమాచారాన్ని అధికారులకు అందించడం జరుగుతుందన్నారు. దీనిపై అధికారులు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముత్తుకూరు మండలంలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల ఉత్పత్తులు తయారు చేయాలంటే లక్షల గ్యాలరీలు అవసరమని, అయితే ఈ నీళ్లను స్థానికంగా ఉన్న కొంతమంది బోర్లు ద్వారా దొడ్డి దారిన ఒక్క రూపాయి చెల్లించకుండా నీళ్లను తోడేస్తున్నారని ఆరోపించారు. ముత్తుకూరులో ఏర్పాటు చేసిన పరిశ్రమల్లో స్థానికంగా ఉన్న వారికి ఒక్కరికి కూడా పర్మినెంట్ ఉద్యోగం ఇవ్వలేదని చెప్పారు. ఈ సమావేశంలో కురు మండలానికి సంబంధించిన వేణుగోపాల్, కె నాగయ్య, జయరాం, ముంగర మస్తాన్, వేణుగోపాల్, మధు తదితరులు పాల్గొన్నారు.