ప్రకృతి పర్యావరణం సాంప్రదాయాల పరిరక్షణే పండుగల పరమార్థం.



 

సనాతన సాంప్రదాయం

భోగి మంటలు-పవిత్ర హోమాలు

కరపత్రం విడుదల చేసిన ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. 

వేదాయపాలెం, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పార్టీ కార్యాలయం నందు సోమవారం, కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (పీఎంపీ అసోసియేషన్ ఆఫ్ ఇండియా), బ్లాక్ బోర్డ్ మిత్ర మండలి సంయుక్త ఆధ్వర్యంలో సనాతన సాంప్రదాయంలో భాగంగా, ప్రకృతి.. పర్యావరణం.. సాంప్రదాయాల పరిరక్షణే పండుగల పరమార్థం అనే కరపత్రికను సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆవిష్కరించి మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత అని, భోగి పండుగ నాడు కొంతమంది అకతాయి పిల్లలు భోగిమంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వ్యర్ధాలు, రబ్బరు వంటి వాటిని వేయడం వల్ల వాటి నుండి వెలువడే రసాయనాలు మన ఆరోగ్యాన్ని తీవ్రంగా నష్టపరుస్తాయని అన్నారు. సాంప్రదాయ ప్రారంభ దినములలో పాత వస్తువులైన గంప, చాట, చీపురు, మంచం, ఈతాకు, తుంగ ఇంతకుమించి వస్తువులను భోగిలో కాల్చేవాళ్ళని, కాలక్రమేణ ప్లాస్టిక్, ఫైబర్ వచ్చిచేరి కాలుష్యాన్ని పెంచేశాయని, ఇకనైనా మనం కళ్ళు తెరవకపోతే ప్రకృతిలో కాలుష్యం విపరీతమై అనారోగ్యాలకు గురికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ కే.శ్యాం ప్రసాద్ శశాంక్ మాట్లాడుతూ నవనాగరిక సమాజంలో టైర్లు, ట్యూబులు మామూలుగానే కాలుష్యం అయితే వాటిని భోగిమంటల్లో వేసి మరింత కాలుష్య కర్మాగారాన్ని తయారు చేస్తున్నామని, దీనివల్ల ప్రాణాంతకమైన వ్యాధులు టీబి, క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నారు. బ్లాక్ బోర్డ్ మిత్ర మండలి అధ్యక్షులు నరసాపురం ప్రసాద్ మాట్లాడుతూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయి ఊపిరితిత్తుల, శ్వాసకోశ, టీబి, నిమోనియా, సిఓపిడి వంటి వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని, కావున ఇకనైనా వీటిపై ప్రత్యేక దృష్టి కనబరచాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్ఎంపీ అధ్యక్షులు కోలా రవీంద్రబాబు, పి హెచ్ పి నాయకులు శాఖవరపు వేణుగోపాల్, గోరంట్ల శేషయ్య, షేక్ మహమ్మద్ గౌస్, కె.రామ రాఘవయ్య, షేక్ గౌస్ బాషా తదితరులు పాల్గొన్నారు.