రైతుల భూ సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సుల ధ్యేయం
రైతుల భూ సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సుల ధ్యేయం..
జలదంకి, మేజర్ న్యూస్ :-
జలదంకి మండలంలోని కోదండరామపురం గ్రామానికి సంబంధించిన భూ సమస్యల తీర్చుటకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహసిల్దార్ ప్రమీల తెలిపారు. రైతుల తమ సమస్యలను రాతపూర్వకంగా తమ దృష్టికి తీసుకుని వచ్చిన వాటిని పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. శుక్రవారం కోదండరాంపురంలో రెవిన్యూ సదస్సు నిర్వహించారు. రెవెన్యూ సదస్సు లో వినతలు వచ్చాయని,రికార్డులు పరిశీలించి త్వరలో పరిష్కరిస్తామన్నారు. రెవిన్యూ సిబ్బందికి రైతుల కూడా సహకరించాలని ఆమె కోరారు. భూ సమస్యలు ఉన్నప్పుడు రైతుల కూడా సహకరిస్తేనే త్వరితగతిన సమస్యలు పరిష్కారం అయ్యేందుకు అవకాశం ఉందన్నారు. పతి రైతు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకొని సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. రైతుల సమస్యలను చెందిన అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ స్పెషల్ ఆఫీసర్ హౌసింగ్ ఈఈ మాధవరావు,ఎండోమెంట్ అధికారి శాంతయ్య, ఆర్ ఐ శ్రీజ,మండల సర్వేర్ శోభన్ బాబు, శ్యాంసన్, వీఆర్వో రoతుల్లా ,సచివాలయం సర్వేయర్ శ్రీహరి,నాయకులు నారాయణరెడ్డి, మద్దూరి శ్రీనివాసులు, జనసేన నాయకులుపల్లె కొండా మాధవ్ రావు,తెలుపొలు రమేష్ గ్రామస్తులు పాల్గొన్నారు.