మంత్రి' ఆనం' ఆదేశాలతో మండలంలో పర్యటించిన దేవాదాయ శాఖ అధికారులు




అనుమసముద్రంపేట మేజర్ న్యూస్  రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదేశాల మేరకు ఏఎస్ పేట మండలంలోని పలు గ్రామాల్లో ఉన్న దేవాలయాలను దేవాదాయ శాఖ అధికారులు పర్యటించి నివేదికలను తయారు చేశారు మండలంలోని అన్ని గ్రామాల్లో ఉన్న దేవాలయాలను పరిశీలించి మరమ్మతులకు గురైన దేవాలయాలను గుర్తించి కొలతలు తీసి నివేదికలను తయారుచేసి అందజేయనున్నట్లు తెలిపారు ఒక్కొక్క దేవాలయానికి మరమ్మతుల నిమిత్తం ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయనున్నట్లు అధికారులు తెలిపారు దేవాలయాల అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని మండల టిడిపి నేతలు కోరిన వెంటనే స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ అధికారులను నివేదికలు అందించాలని సూచించారు దాంతో ఎండోమెంట్ అధికారులు ఏఎస్పేట మండలంలో పర్యటించి వివరాలు నమోదు చేశారు ఈ మేరకు అడిగిన వెంటనే స్పందించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కి మండలంలోని అన్ని గ్రామాల నాయకులు ప్రజలు తరపున తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ అబ్బూరి రమేష్ నాయుడు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు