నెల్లూరు నగరంలోని టౌన్ హాల్ లో నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమైన యువజన ఉత్సవ్ కార్యక్రమం




ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, భూకంపాల నుంచి సురక్షితంగా బయటపడడం, బయోగ్యాస్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, ఆధార్ కార్డ్ డేటా ఆధారంగా ఫింగర్ ప్రింట్ ఉపయోగించి ఓటు వినియోగించే యంత్రం అందరిని ఆలోచింప చేసే విధంగా ఆకట్టుకుంటున్న విద్యార్థుల  సైన్స్ ప్రదర్శనలు

విద్యార్థుల్లో ఆసక్తి పెంచేలా స్కిల్ డెవలప్మెంట్, వ్యవసాయంలో సైన్స్ టెక్నాలజీ, ప్లాస్టిక్ ని అరికడుతూ జూట్ బ్యాగుల వినియోగం, సేంద్రియ ఉత్పత్తుల స్టాల్స్ ఏర్పాటు

సైన్స్ మేళా, మొబైల్ ఫోటోగ్రఫీ, యువ రచయితల పోటీలు, డ్రాయింగ్, సాంస్కృతిక ప్రదర్శనల్లో విద్యార్థులకు పోటీలు

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన నగర మేయర్ స్రవంతి, విక్రమ సింహపురి వైస్ ఛాన్స్లర్ ప్రొఫెసర్ విజయభాస్కరరావు, పలువురు జిల్లా స్థాయి అధికారులు

భారత దేశ ఔన్నత్యాన్ని, సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, గొప్ప మేధావి స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకుని విద్యార్థులు దేశ అభివృద్ధిలో భాగం కావాలి : మేయర్ స్రవంతి