ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కలిసిన సుబ్బారెడ్డి
ఎమ్మెల్సీ పర్వతరెడ్డి కలిసిన సుబ్బారెడ్డి
నెల్లూరు, మేజర్ న్యూస్ : వైఎస్ఆర్సిపి జిల్లా అధికార ప్రతినిధి నేతాజీ సుబ్బారెడ్డి గారి ఆధ్వర్యంలో 45 వ డివిజన్ వైసీపీ నాయకులు, కార్యకర్తలు సోమవారం ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డిని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నూతన సంవత్సరంలో నూతన ఉత్సాహంతో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు మరిన్ని సేవలు అందించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో
మోహన్, రమణ, బాలయ్య, వాసు, రత్నం, సుధాకర్, సుబ్రహ్మణ్యం రెడ్డి, సునీల్ కుమార్ రెడ్డి, ముజీబ్ తో పాటు వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.