కండలేరు జలాశయం వరద కాలువ విస్తరణలో నిలిపివేసిన పనులు ప్రారంభించాలి
కండలేరు జలాశయం వరద కాలువ విస్తరణలో నిలిపివేసిన పనులు ప్రారంభించాలి
పెండింగ్ లో ఉన్న ముంపు పునరావాస కేంద్రాలు నిర్మించాలి
బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తెలుగు గంగ పర్యవేక్షకు ఇంజనీర్ రాధాకృష్ణమూర్తికి విజ్ఞప్తి
నెల్లూరు సిటీ మేజర్ న్యూస్
కండలేరు జలాశయం వరద కాలువ విస్తరణలో నిలిపివేసిన పనులు ప్రారంభించా లని, పెండింగ్ లో ఉన్న ముంపు పునరావాస కేంద్రాలు నిర్మించాలని బిజెపి నమామి గంగే రాష్ట్ర కన్వీనర్ మిడతల రమేష్ తెలుగు గంగ పర్యవేక్షకు ఇంజనీర్ రాధాకృష్ణమూర్తికి విజ్ఞప్తి విజ్ఞప్తి చేశారు సోమశిల నుండి కండలేరుకు నీటిని తీసుకువచ్చే వరద కాలవను 12,000 క్యూసెక్కుల నుండి 24 వేల క్యూసెక్కులకు విస్తరించేందుకు పనులు ప్రారంభించి అర్ధాంతంగా నిలిపివేశారు. 1300 కోట్లు విలువచేసే ఈ పనులను వెంటనే ప్రారంభించాలని బిజెపి డిమాండ్ చేస్తుందన్నారు
రేగడిపల్లి దాచురు రత్నాపురం గ్రామాల పునరావాసానికి చాటగుట్లలో 50 ఎకరాల భూమి కేటాయించారు. వైసిపి ప్రభుత్వం ఆ పునరావాస కేంద్రాన్ని అడ్డుకోవడంతో స్థానికులు ఆ భూమిపై అభ్యంతరాలు తెలిపి ఉన్నారు. వారు అభ్యంతరాలు పరిష్కరించి ముంపు గ్రామాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు
రాంకురు పునరావాస కేంద్రం స్మశాన స్థలం అయినందున 112 కుటుంబాలు అందులో జీవించేందుకు సిద్ధంగా లేరు. వారికి ప్రత్యామ్నాయ భూమి లో పునరవాసం కేంద్ర ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు
నెల్లూరు కండలేరు పునరావాస కేంద్రంలో కేటాయించిన స్థలం లో 150 అంకణాలు ఆక్రమించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి ఆ భూమిని రక్షించాలని ఎస్సీ దృష్టికి రమేష్ తీసుకెళ్లారు
ఈ కార్యక్రమంలో నరాల సుబ్బారెడ్డి.నీలి శెట్టి లక్ష్మణరావు. నారాయణ యాదవ్. ప్రభాకర్ యాదవ్ కళ్ళు భాస్కర్. ముని సురేష్ .సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు