కన్నుల పండుగగా శ్రీ పోలేరమ్మ తల్లి జాతర.








అల్లూరు మేజర్ న్యూస్:-

అల్లూరు గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి జాతర మంగళవారం రాత్రి కన్నుల పండువగా సాగింది. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు  వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, నెల్లూరు రూరల్ టిడిపి నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, పలువురు ప్రముఖులు  అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి  ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడుతూ అల్లూరు గ్రామ దేవత ఎంతో మహిమ గల తల్లి, శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లిని దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతం, మహద్భాగ్యం అన్నారు. రాష్ట్ర ప్రజలందరిపై, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పై, రాష్ట్ర ప్రభుత్వంపై ఆ పోలేరమ్మ తల్లి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని అమ్మను వేడుకున్నానన్నారు. ఎటువంటి అరిష్టాలు లేకుండా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలు సుఖ సంతోషాలు సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలని రాష్ట్ర సుభిక్షంగా ఉండాలని అత్యంత మహిమగల శ్రీ పోలేరమ్మ తల్లిని మనసారా ప్రార్ధించానని తెలిపారు. కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులు కావలి నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రతి ఒక్కరు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానన్నారు. కావలి అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని కావలి నియోజకవర్గంలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది రాకుండా కాపు కాస్తానని తెలిపారు. అల్లూరు అల్లుడిగా అల్లూరు ప్రజలు చూపుతున్న అభిమానం ఎనలేనిదని తెలిపారు.