ఇప్పటివరకు 40 రెవెన్యూ సదస్సులు పెట్టిన ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి
ఇప్పటివరకు 40 రెవెన్యూ సదస్సులు పెట్టిన ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయి..
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి..
పొదలకూరు మేజర్ న్యూస్.
ఇప్పటివరకు 40 రెవెన్యూ సదస్సులు పెట్టిన ఇంకా సమస్యలు వస్తూనే ఉన్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు.బుధవారం పొదలకూరు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో "ప్రత్యేక ఫిర్యాదుల పరిష్కార వేదిక" (స్పెషల్ గ్రీవెన్స్) కార్యక్రమానికి ఆయన నెల్లూరు ఆర్డీఓ నాగ అనూషతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈసందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ తాము అన్నదాతల కోసం వారి భాగస్వామ్యంతో 130 పనులకు గాను 10.75 కోట్లు ఖర్చు చేస్తే ,కాకాణి కేవలం ఐదు పనులకు 30 కోట్లు ఖర్చుచేసినట్లు దోచుకున్నారన్నారు. మండలంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పనిచేసిన తహసీల్దార్లు వీర వసంతరావు,స్వాతి అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారన్నారు. వారు చేసిన భూ కుంభకోణాల వల్ల మండలంలోని అనేకమంది రైతులు బలయ్యారని, నిబంధనలకు విరుద్ధంగా మరుపూరులో ట్యాక్స్ కట్టే ధనవంతులకు భూపట్టాలు, సూరాయపాలెం వైసీపీ నేతలు 36 ఎకరాల భూమి ఆక్రమణలు చేశారన్నారు. భూ అక్రమాలకు పాల్పడి సస్పెండ్ అయినతహసిల్దారు ఇద్దరికీ కాకాణి అండదండలు ఉండడంతోనే వారు అక్రమాలు చేశారన్నారు. తాను ముత్తుకూరు మండలం పైనాపురం గ్రామాన్ని దత్తత తీసుకొన్నట్లు తెలిపారు.అక్కడ గిరిజన బిడ్డలు కనీసం ఆధార్ కార్డులకు కూడా నోచుకోకపోవడం బాధాకరమన్నారు.టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడినాక నేను గిరిజనుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టానన్నారు.ఒక్క పైనాపురం పంచాయతీలో 70 మందికి జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయించడంతో పాటు 80 మందికి ఆధార్ కార్డులు నమోదు చేయించాం, 17 మందికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చామన్నారు.35 మందికి రేషన్ కార్డులు లేవని,18 మంది పింఛన్ పొందలేకపోతున్నారన్నారు.12 మంది ఉద్యోగులతో గ్రామంలోనే సచివాలయం ఉండటంతో పాటు మండల స్థాయిలో అధికారులు ఉన్నా పేదల కనీస అవసరాలు తీర్చలేకపోడం సరికాదన్నారు.జిల్లా స్థాయిలో గిరిజనులకు ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, పింఛన్లు మంజూరు చేయడంపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.తాను ఇటీవలే సర్వేపల్లి నియోజకవర్గ స్థాయిలో గిరిజనుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహించి,చాలా సమస్యలు పరిష్కరించినట్లు తెలిపారు. గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నా, పేదలకు న్యాయం జరుగుతున్న ఓర్వలేని ప్రేమ, జాలి, కరుణ లేని కాకాణిది అసలు ఏ రక్తమో! రక్త పరీక్ష చేయించాలన్నారు. ఈ ప్రత్యేక విజ్ఞప్తుల దినంలో ప్రజల నుంచి వచ్చిన అర్జీలు అన్నిటిని త్వరితగతన పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ శివ బాలకృష్ణయ్య, ఎంపీడీవో నరసింహారావు, టిడిపి మండల అధ్యక్షులు తలచీరు మస్తాన్ బాబు,బొద్దులూరు.మల్లిఖార్జున్ నాయుడు, రైతు సంఘం నాయకులు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి, పులిపాటి వెంకటరత్నం నాయుడు,అనీల్ కుమార్,బొబ్బేపల్లి సురేష్ నాయుడు ,ఆదాల సుగుణమ్మ పాల్గొన్నారు.