కోవూరుపల్లి పంచాయితీలో  రెవెన్యూ సదస్సు.




బోగోలు మేజర్ న్యూస్:-

రైతుల యొక్క భూసమస్యలను పరిష్కరించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం రెవెన్యూ సదస్సు బోగోలు మండలం కోవురుపల్లి  సచివాలయంలో శుక్రవారం మండల రెవెన్యూ అధికారి అయిన ఎం.సురేష్ బాబు అధ్యక్షతన రెవిన్యూ సదస్సు నిర్వహించారు. రైతుల భూ సమస్యలపై అర్చీరలు స్వీకరించి సత్వరమే సమస్యలను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో 

ఇందుపురు రామ మోహన్ రెడ్డి, నాటకరాని శీనయ్య, నాటకరాని రంగయ్య, నాటకరాని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.