రెవెన్యూ సదస్సులో పాల్గొన్న అధికారులు. అయ్యా మా భూములు సమస్యలు పరిష్కరించండి. 




21 అర్జీలు తీసుకున్న రెవెన్యూ శాఖ అధికారులు. 

ముత్తుకూరు, జనవరి 8 (మేజర్ న్యూస్) అయ్యా మా భూములు సమస్యలు పరిష్కరించండి అంటూ పొట్టెంపాడు గ్రామ రైతులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బుధవారం గ్రామ సచివాలయంలో రెవెన్యూ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి అధికార పార్టీ నాయకులతో పాటు సర్వే డిప్యూటీ తాసిల్దారు శ్రీనివాసులు, భూమి కొలతల శాఖ అధికారి అను రూప్ , గ్రామ రెవెన్యూ అధికారులు, రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రీసర్వేమూలంగా సమస్యలు ఎదుర్కొన్న రైతాంగం సుమారు 21 అర్జీలు అధికారులకు ఇవ్వడం జరిగింది. గడువులోగా పరిష్కారం చూపెడతామని రైతులకు రెవెన్యూ శాఖ హామీ ఇచ్చింది.