గుంతలు లేని రోడ్లుగా నెల్లూరు రూరల్
గుంతలు లేని రోడ్లుగా నెల్లూరు రూరల్
ఎన్నికలవరకే రాజకీయాలు... ఎన్నికల తరువాత అభివృద్ధి ఒక్కటే
వేల కోట్ల కోటీశ్వర్లు నామీద పోటీ చేసి కోట్ల రూపాయలు కుమ్మరించినా ఘన విజయం అందించారు
నెల్లూరు రూరల్ ఎంయల్ ఏ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్ లోని ఫత్తేఖాన్ పేట మెయిన్ రోడ్డు నిర్మాణ పనులకు 68 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ, స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ మరియు టీడీపీ నాయకులు పిండి సురేష్.
రాబోయే రోజుల్లో 36వ డివిజన్ కు అభివృద్ధి పనులకు కోటి రూపాయల నిధులను కేటాయిస్తాం. భవిష్యత్తులో ఈ డివిజన్ మీద ప్రత్యేక దృష్టి సారిస్తాం.
వేల కోట్ల కోటీశ్వర్లు నామీద పోటీ చేసి కోట్ల రూపాయలు కుమ్మరించినా నిరంతరం ప్రజల మధ్య ఉండే నన్ను మీ ఇంటి బిడ్డగా ఆదరించి, భారీ మెజారిటీని అందించారు.
పై కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జి ఊరందూరు సురేంద్ర బాబు, టీడీపీ నాయకులు పూడి ఆనంద్, చెంగలపట్టు శేఖర్, బాపనపల్లి శశిధర్, సింహాచలం, సుగుణా రెడ్డి, శ్రీధర్, షణ్ముగం, సుబ్బయ్య, ధనుంజయ, అనిల్, చైతన్య, జనసేన పార్టీ నాయకులు నూనె మల్లికార్జున యాదవ్, చిత్తలూరు సుందర రామిరెడ్డి, జమీర్, బీజేపీ నాయకులు ఫణి రాజ్, మల్లి రవి, మూర్తి, నారాయణ రావు తదితరులు పాల్గొన్నారు