మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
మజ్జిగ చలివేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి
నెల్లూరు [బుచ్చిరెడ్డిపాలెం], రవికిరణాలు ఏప్రిల్ 23 :
బుచ్చిరెడ్డి పాళెం పట్టణం బస్టాండ్ సెంటర్లో కోవూరఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి చలివేంద్ర ప్రారంభించారు. వేసవి సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చేందుకై చలివేంద్ర ఏర్పాటు చేసిన బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి కమీషనర్ బాలకృష్ణ, ఛైర్ పర్సన్ మోర్ల సుప్రజ లను ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి అభినందించారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి ప్రజాహిత కార్యక్రమాలలో భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్లు యరటపల్లి శివకుమార్ రెడ్డి, పఠాన్ నస్రీన్ ఖాన్లతో పాటుటిడిపి నాయకులు బత్తులహరికృష్ణ, ఎంవి శేషయ్య, బుచ్చిరెడ్డి పాళెం నగర పంచాయతి కౌన్సిలర్లు పాల్గొన్నారు.