తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య.
తొలి ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకున్న ఎమ్మెల్యే కావ్య.
బోగోలు మేజర్ న్యూస్ :-
ఆ భగవంతుని చల్లని చూపు
కావలి నియోజకవర్గ ప్రజలపై వెళ్ళవెలల ఉండాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి పేర్కొన్నారు. బోగోలు మండలం కొండ బిట్రగుంట ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు
శుక్రవారం ముక్కోటి ఏకాదశి పర్వదినం సందర్భంగా కావలి శాసనసభ్యులు కుమార్తె సంహిత రెడ్డి, అల్లుడు బినీత్ రెడ్డి తో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఆలయాలకు విచ్చేసిన ఎమ్మెల్యే కు ఆలయ కమిటీ సభ్యులు అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామివారికి నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే తీర్ధ, ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి విశిష్టత ను తెలియజేసారు. కావలి నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ చార్యులు , ఆలయ ఈఓ రాధాకృష్ణ, మండల టిడిపి అధ్యక్షులు మాలేపాటి నాగేశ్వరరావు, కోడూరు వెంకటేశ్వర్లు,ఎర్రం వెంకటేశ్వర్లు, సుబ్బారెడ్డి, రావి విజయ్, చిలకపాటి వెంకటేశ్వర్లు, తులసీరామ్ యాదవ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.