ఈరోజు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 14 డివిజన్లో ప్యాచ్ వర్క్ లను టెంకాయ కొట్టి ప్రారంభించిన 14 డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి.
ఈరోజు గౌరవనీయులైన శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు 14 డివిజన్లో ప్యాచ్ వర్క్ లను టెంకాయ కొట్టి ప్రారంభించిన 14 డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి.
పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు నెలరోజుల క్రిందట ఎమినిటీ సెక్రటరీ వాణిశ్రీ గారు మరియు ప్లానింగ్ సెక్రటరీ సుమంత్ గారితో కలిసి డివిజన్ లో పర్యటించి, దాదాపు 32 ప్యాచ్ వర్క్ ల ను గుర్తించడం జరిగింది.మంత్రివర్యులు శ్రీ నారాయణ గారు అధికారులతో ఎస్టిమేషన్ వేయించారు. వెంటనే పనులు ప్రారంభించమని అధికారులను ఆదేశించారు. ఐదు లక్షల 89 వేల రూపాయలతో ప్యాచ్ వర్క్ లను ఈరోజు ప్రారంభించడం జరిగింది.
ఈ సందర్భంగా డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాపరెడ్డి మాట్లాడుతూ నన్ను కార్పొరేటర్ గా 1918 ఓట్ల భారీ మెజార్టీతో, డివిజన్ ప్రజలు గెలిపించారు. వారి రుణం తీర్చు కోవడానికి డివిజన్లో తిరుగుతూ, ప్రతినిత్యం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ మన మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారి దృష్టికి, మరియు అధికారులు దృష్టికి తీసుకొని వెళ్లి పరిష్కరిస్తున్నామని తెలియ జేసారు.