దేవర తిప్పలో చెలరేగిపోతున్న పుష్పాలు తూతూ మంత్రంగ అధికారు ల తనిఖీలు
దేవర తిప్పలో చెలరేగిపోతున్న పుష్పాలు తూతూ మంత్రంగ అధికారు ల తనిఖీలు
దోసేస్తున్న పుష్ప గ్యాంగ్ లు
అధికార కనుసన్నల్లో తరలి పోతున్న తెల్లారాయి
సైదాపురం మండలం మేజర్
న్యూస్ :- సైదాపురం మండల కేంద్రమైన సైదాపురం రెవెన్యూ కార్యాలయానికి వెనుక ఉన్న దేవరతిప్పలో పగలు కూలీలతో రాయి గుట్టలను ఏర్పాటు చేయించుకుని చీకటి అయ్యేసరికి ట్రాక్టర్ల సాయంతో తిప్పనుండి రాయి కిందకి దించి అక్కడనుండి లారీలకు ఎత్తి తరలించడం జరుగుతుoడటంవిశేషం ఈ మాఫియా దందా అర్ధరాత్రి రెండు వరకు ఈ మాఫియా ఆగడాలు కొనసాగుతూ ఉన్నాయి మండల కేంద్రంలో స్మోక్ రాయికీ పెద్ద గిరాకీ ఉండడంతో చెలరేగిపోతున్న పుష్పాలు అంతా మా ఇష్టం
మేము చెప్పిందే రేటు మేమే కొంటాం అంటూ పట్టపగలే కొంతమంది వ్యక్తులు తిరుగుతూ పగలు అందరి దగ్గర ఉన్నటువంటి రాయిని టన్ను 5000 రూపాయలకి విక్రయించి ఈ మాఫియా గ్యాంగ్ తెల్ల స్మోక్ రాయి చెన్నైకీ టన్ను 40000 రూపాయలకు తరలిస్తున్నారు అధికార యంత్రాంగం తూతూ మంత్రంగా పనిచేస్తుందని సంబంధిత అధికారులకు చెప్పినా కానీ స్పందించకపోవడంలో ఈ మాఫియా తో అధికారులకు ఎంత సన్నిహిత భావం ఉందో అని భారీ స్థాయిలో ప్రజలు వినిపిస్తున్నాయి. మండల కేంద్రంలో కూత వేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉన్నప్పటికీ మాఫియా గ్యాంగ్ ను అడ్డుకోకపోవడంలో ఏమిటా అని వాబోతున్నారు.
అధికారుల పాత్ర :-
సైదాపురం మండల కేంద్రంలో అధికారులకు కూత వేటు దూరంలో మండల తాసిల్దార్ ఆఫీస్ ఉన్నప్పటికీ పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని. తిప్ప మీద బండ్లు ఉన్నప్పుడు పోలీసులకు సమాచారం ఇచ్చిన పోలీస్ యంత్రాంగం కూడా తూతూ మంత్రంగా పనిచేస్తుందని ఇది అధికారులకు తెలిసే పోతుందా లేకపోతే తిప్ప మీద ఇంత రాయి తరలిపోతున్నప్పటికీ ఒక బండిని కూడా పట్టుకున్న దాఖలు లేవని ఇది దేనికి సంకేతం అని మండల ప్రజలు విస్మరించుకుంటున్నారు.
మైనింగ్ డిపార్ట్మెంట్ :-
మైనింగ్ డిపార్ట్మెంట్ సైదాపురం మండలంలో గత ప్రభుత్వంలో రాయి యాడ్లు పర్మిషన్లు ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటిని తాత్కాలికంగా నిలిపివేసి ఏ యాడ్లో ఎంత స్టాక్ ఉందో గుర్తించి వాటికి పర్మిషన్ ఇచ్చేవరకు ఎత్తకూడదని యార్డ్ యజమానులకు తెలియజేశారు. అయితే మైనింగ్ అధికారుల అనుమతులు లేకుండా మాఫియా దారులు ఖాళీగా ఉన్న స్థలాలను పొలాలను విచ్చలవిడిగా మాఫియా గ్యాంగ్ రాయి యాడ్లుగా ఏర్పాటు చేసుకొని డంపింగ్ చేసి రాత్రి 11:00PM గంటల నుంచి అర్ధరాత్రి 3:30AM గంటల మధ్య లారీలకు లోడులు చేయించుకుని తరలిస్తూ ఉండడం మైనింగ్ యంత్రాంగం మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం గమనార్ధం