నెల్లూరు నగరంలో ఘనంగా హోటల్ దావత్ ప్రారంభం




నెల్లూరు నగరంలోని బీవీనగర్ ఆర్టీవో ఆఫీస్ సెంటర్ సమీపంలో హోటల్ దావత్ ను సోమవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి హాజరయ్యారు. నెల్లూరు నగర ప్రజలకు అద్భుత రుచులను అందించేందుకు హోటల్ దావత్ ను అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని నిర్వాహకులకు అభినందనలు తెలిపి హోటల్ దావత్ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు. హోటల్ దావత్ నిర్వాహకులు నాసీర్ మాట్లాడుతూ ఇప్పటికే పడారుపల్లి, బీవీనగర్ మధ్యలో మండి హోటల్ తో మంచి పేరు సంపాదించుకున్నామని ప్రజలు ఎంతగానో ఆదరించారన్నారు. రెండో బ్రాంచ్ గా హోటల్ దావత్ ను  ప్రారంభించామని దీనిని కూడా కస్టమర్లు ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు నాజర్, తెలుగుదేశం పార్టీ నాయకులు గుద్దేటి చెంచయ్య, కనపర్తి గంగాధర్, బూడిద పురుషోత్తం, కార్పొరేటర్ ఒరిస్సా శ్రీనివాసులురెడ్డి, మూలే విజయ్ భాస్కర్ రెడ్డి, బిఎన్ నవీన్ రెడ్డి, శివ, షాజహాన్ మౌలాలి తదితరులు పాల్గొన్నారు