అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమం
అగ్నిమాపక వారోత్సవాల కార్యక్రమం
నెల్లూరు [వింజమూరు], రవికిరణాలు ఏప్రిల్ 16 :
అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా మూడవరోజు వింజమూరు అగ్నిమాపక కేంద్ర అధికారి ఎం చంద్రమౌళిఆధ్వర్యంలో స్థానిక బీసీ కాలనీలో కార్యక్రమం నిర్వహించారు వంట చేస్తున్నప్పుడు గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం జరిగితే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డెమో ద్వారా చేసి చూపించారు అలాగే షార్ట్ సర్క్యూట్ జరిగినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో అవగాహన కల్పించారు వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలను ఎలా నివారించుకోవాలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేశారు ప్రధాన రహదారి యందు అగ్ని ప్రమాదాల పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలియజేస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో మహేంద్ర జి మాధవ ప్రభాకర్ గోపి తిరుపతి పివి రమణ వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.