అవార్డు అందుకున్న పోర్టు అధికారులు జాతీయస్థాయిలో కృష్ణపట్నం పోర్టుకు ఎన్విరాన్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు
అవార్డు అందుకున్న పోర్టు అధికారులు జాతీయస్థాయిలో కృష్ణపట్నం పోర్టుకు ఎన్విరాన్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు
ముత్తుకూరు, జనవరి 8 ( మేజర్ న్యూస్) అదానీ కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ కు ప్లాటినం కేటగిరీ కింద సేవా రంగంలో జాతీయ స్థాయి 18వ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ఎన్విరాన్‌మెంట్ ఎక్సలెన్స్ అవార్డు 2024ని అందుకుంది. ఈ విషయాన్ని కృష్ణపట్నం పోర్టు అధికారులు బుధవారం తెలిపారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మహిళా, శిశు అభివృద్ధి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్. శశి పంజా, పర్యావరణ శాఖ అదనపు ముఖ్య కార్యదర్శి శ్రీమతి రోష్ని సేన్ IAS వారికి అవార్డు, మెమెంటో తో పాటు ధృవీకరణ పత్రాన్ని అందజేశారు. కోల్‌కతాలోని తాజ్ బెంగాల్ హోటల్‌లో జరిగిన కార్యక్రమం లో అదాని కృష్ణపట్నం పోర్టు హెడ్ డ్రై కార్గో ఆపరేషన్స్ మిస్టర్ విజయ్ రాథోడ్ బృందం ఈ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఆదాని కృష్ణపట్నం పోర్టు సీఈఓ జగదీష్ పటేల్ బృందాన్ని అభినందించారు. జాతీయస్థాయి అవార్డు రావడం పట్ల సీఈఓ మాట్లాడారు. సుస్థిరత, పర్యావరణ ఆవిష్కరణ బాధ్యతాయుతమైన వ్యాపార విధానాల పట్ల అదాని కృష్ణపట్నం పోర్ట్ లిమిటెడ్ యొక్క నిబద్ధతకు ఈ అవార్డు నిదర్శనమని అన్నారు.