అభాగ్యుడి దీనగాధకు స్పందించిన దాతలు
అభాగ్యుడి దీనగాధకు స్పందించిన దాతలు
నెల్లూరు [వింజుమూరు], రవికిరణాలు ఏప్రిల్ 16 :
అభాగ్యులకు ఆపన్న హస్తం అందిస్తూ సమాజ సేవలో విధులు నిర్వహిస్తూ, ప్రజాసేవలో నేను సైతం అంటూ ఉన్నదాంట్లో ఉడతా భక్తిగా అభాగ్యులకుఆర్థిక సహాయం చేస్తూ ఆపద్బాంధవుడులా నిలుస్తున్నారూ దాతలు.
వివరాలలోనికి వెళితే కలిగిరి మండలానికి చెందిన ఈ దాతల బృందం సమాజ సేవలో తరించాలని. సమాజ సేవలో పరితపించాలని వారి ఉద్దేశము వారికి. పేదలంటే మమకారం. అన్యాయం జరిగితే ఓర్చుకోని గుణం, అభాగ్యులకు ఆపద కలిగిందంటే కరిగిపోయే మనస్తత్వం, ఉన్నదాంట్లో పేదవారికి అభాగ్యులకు ఉడతా భక్తిగా ఆర్థిక సహాయం అందజేసి ఆ ఆనందంలో తరిస్తున్నారు. అందులో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాలలో అభాగ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. బుధవారం వింజమూరు పంచాయతీ పరిధిలోని జీబికేఆర్ ఎస్టి కాలనీకి చెందిన రావూరికిషోర్ విద్యుత్ షాక్ కు గురై ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. సుమారు 40% శరీరం కాలిపోయింది. వైద్యం ఖర్చులకు డబ్బులు లేక మంచానికే పరిమితమై బాధను అనుభవిస్తున్నారు. విషయం తెలుసుకున్న దాతలు ఆయన ఎంత ఇచ్చారు నివాసానికి వెళ్లి అతని భార్య అంజలికి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు దాంతోపాటు ఐదు జతల బట్టలు ఒక బియ్యపు బస్తా అంద చేశారు. తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానని వారి కుటుంబానికి భరోసా కల్పించారు. ఇది తెలిసిన సీనియర్ సిటిజనుల సైతం శభాష్ దాతలారా అంటున్నారు. దాతలు నియోజకవర్గ గౌడ సంఘ అధ్యక్షులు మాల్యాద్రి గౌడ్ చిన్న గౌస్ పీర్ జిలాని జయకృష్ణ మహేష్ మస్తాన్ ఉన్నారు. భవిష్యత్తులో కూడా ఎవరికి ఎలాంటి ఆపద సంభవించిన లేదా అవసరం వచ్చిన వెంటనే స్పందిస్తామని వారు తెలిపారు