శ్రీ మల్లికార్జున స్వామి వారికి విరాళములు
శ్రీ మల్లికార్జున స్వామి వారికి విరాళములు
నెల్లూరు కల్చరల్ మేజర్ న్యూస్
శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం, జొన్నవాడ క్షేత్రమునకు
ఏఎస్ పేట మండలం గుంపర్లపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ పులి సుబ్బారెడ్డి ధర్మపత్ని శ్రీమతి గారతమ్మ గార్లు శ్రీవార్ల నిత్య అన్నదానమునకు రూ 6,25,000/- లు విరాళంగా మరియు నెల్లూరు నగరం వాస్తవ్యులు శ్రీ కొమ్మి మల్లికార్జున నాయుడు ధర్మపత్ని శ్రీమతి రాధికా గార్లు శ్రీవార్ల నిత్య అన్నదానమునకు రూ 1,60,000/- లు విరాళంగా సమర్పించారు. ఈ సందర్భంగా దేవస్థాన సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ ఆర్వభూమి వెంకట శ్రీనివాసులు రెడ్డి గారు దాతలకు శ్రీవార్ల దర్శనం కల్పించి ప్రత్యేకంగా పూజలు జరిపించారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రం, కుంకుమ, తీర్ధ ప్రసాదములు దాతలకు అందజేసినారు.